తాము ఎదిగిన ఈ శిఖరానికి మా విజ్ఞాన సామ్రాజ్యానికి తమకు జ్ఞానాన్ని అందించిన తమ విద్యా సంస్థకు, విద్యార్థుల కృతజ్ఞతగా ఒక భారీ కానుకని అందించారు. ఐఐటీ కాన్పూర్ లో చదువుకున్న 2000 సంవత్సరం విద్యార్థులు తమ మాతృ విద్యాసంస్థకు రూ.100 కోట్ల విరాళం ప్రకటించారు. విద్యాసంస్థ క్యాంపస్ లో జరిగిన సిల్వర్ జూబ్లీ రీ యూనియన్ లో వారు ఈ ప్రకటన చేశారు. మిలీనియం బ్యాచ్ 2000 సంవత్సరం విద్యార్థులు తమ కృతజ్ఞతా భావాన్ని ప్రకటించుకున్నారు. పూర్వ విద్యార్థులు ఇంత పెద్దమొత్తంలో మాతృ విద్యాసంస్థకు విరాళం ప్రకటించడం దేశంలోనే మొదటిసారి. ఈ విరాళాన్ని ‘మిలీనియం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సొసైటీ’ ఏర్పాటుకు ఉపయోగించాల్సిందిగా మేనేజ్మెంట్ ను వారు కోరారు. ఈ సమ్మేళనంలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచీ పూర్వ విద్యార్థులు తరలివచ్చారు. పూర్వ విద్యార్థులు చేసిన ఈ పని పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.