ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీ.జీ.భరత్ వ్యాయామం చేస్తూ ఉన్న వీడియోపై విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అత్యుత్తమ పెట్టుబడి వాతావరణాన్ని కల్పించడం కోసం, మన పరిశ్రమల శాఖ మంత్రి భరత్ అడ్డంకులను అధిగమిస్తూ (దూకుతూ) ముందుకు సాగుతున్నారని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ వీడియోలో భరత్ ఎత్తుగా ఉన్న ఒక బల్లపైకి ఎగురుతూ కసరత్తులు చేస్తుండగా మంత్రి లోకేష్ సరదాగా వ్యాఖ్యానించారు. పెట్టుబడుల కల్పన కోసం ఆయన శ్రమిస్తున్నారనే భావనను వ్యక్తపరుస్తూ లోకేష్ స్పందించారు. ఇక రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో ఇన్వెస్టర్లకు వేగవంతమైన సేవలందించాలనే టార్గెట్ తో పని చేస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ను పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానంగా నిలపాలనేదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి లోకేష్ పెట్టుబడుల కల్పనే లక్ష్యంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రపంచం లోనే ప్రఖ్యాత కంపెనీలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు వేగంగా అడుగులు వేస్తున్నాయి.