ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆంధ్ర రాష్ట్ర సాధకుడు అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని చిరస్థాయిగా స్మరించుకునేలా 58 అడుగుల “అమరజీవి త్యాగశిల్పం (Statue of Sacrifice)” కాంస్య విగ్రహాన్నిఏర్పాటు చేశారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఏపీ బీజేపీ ఛీఫ్ మాధవ్, కేంద్రమంత్రి పెమ్మసాని, మంత్రులు టీజీ భరత్, సవిత, నారాయణ, నాదెండ్ల, దుర్గేష్ , చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యే శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించి నివాళులు అర్పించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను అర్పించిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారి త్యాగం తరతరాలకు స్ఫూర్తిదాయకమని వారి త్యాగస్ఫూర్తి ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవానికి చిరస్మరణీయ చిహ్నంగా నిలుస్తుందని నేతలు పేర్కొన్నారు.
