ఇలాంటి వెయ్యి మంది సైకోలు వచ్చినా ‘అమరావతి’ ఆగదు:ఏపీ సీఎం చంద్రబాబు

Spread the love

బాపట్ల జిల్లా, వేమూరు నియోజకవర్గం, సూరేపల్లిలో ఏపీ సీఎం చంద్రబాబు  ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజావేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించారు. అనంతరం రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను అందించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్రంలో అందరి సంక్షేమం, అన్ని ప్రాంతాల అభివృద్ధి, సుపరిపాలన అందిస్తామని హామీ ఇచ్చి ఆ దిశగానే ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. మొన్నటివరకు 3 ముక్కలాట… ఇప్పుడు మావిగన్ అంట. ఇంకా నయం వాటికన్ అనలేదు, వాటికన్ ప్రతిష్టను  దెబ్బతీయలేదన్నారు. జగన్ లాంటి సైకోలు వెయ్యిమంది వచ్చినా అమరావతి ఆగదని స్పష్టం చేశారు. మహిళల కోసం పోరాటమని జగన్  డ్రామాలు ఆడుతున్నాడని మండిపడ్డారు.  మీడియాలోపై దాడులు చేస్తున్నాడు. గతంలో ఎన్నోసార్లు మహిళలను వైసీపీ నేతలు అవమానించారు, వేధించారు. సమాధానం చెప్పే దమ్ము ఉందా అని వైసీపీని ప్రశ్నించారు. రాజకీయ పార్టీలు లేకపోతే  జగన్. లాంటి వ్యక్తి బయటకు కూడా వచ్చే పరిస్థితి లేదని అన్నారు. ప్రతి ఒక్కడూ నన్నే లేపేస్తా అంటాడు… దాడులు చేస్తాం అంటారు… ఏమి అంత ఈజీగా ఉన్నామా మేము? అని చంద్రబాబు ఫైర్ అయ్యారు. తల్లిని కోర్టుకు ఈడ్చిన  వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవద్దని ప్రజలకు సూచించారు. 

వారి ముఖాల్లో కనిపించిన ఆనందం ఎంతో సంతృప్తినిచ్చింది 

గత ప్రభుత్వం సృష్టించిన భూ వివాదాలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ పోతున్నట్లు తెలిపారు.  ప్రతి నెల 9వ తేదీన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొని పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తూ  రెవెన్యూ శాఖలో ప్రభుత్వం తెచ్చిన మార్పులు, సంస్కరణలు ప్రజలకు వివరిస్తున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కారం చేసేందుకు యంత్రాంగానికి ఆదేశాలు ఇస్తున్నట్లు తెలిపారు.  ఇందులో భాగంగా నేడు బాపట్ల జిల్లా, వేమూరు నియోజకవర్గం, సూరేపల్లిలో ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమం నిర్వహించి భూ యజమానులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు అందచేసినప్పుడు వారి ముఖాల్లో కనిపించిన ఆనందం ఎంతో సంతృప్తినిచ్చిందని ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు 21.23 లక్షల పాసు పుస్తకాల పంపిణీ పూర్తి చేశాం. 2027 మార్చి నాటికి రీసర్వే 2.0 ప్రక్రియ ముగించి 1.12 కోట్ల పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.  ఆటో మ్యూటేషన్ తరువాత పట్టాదారు పాస్ పుస్తకాన్ని నేరుగా ప్రజల ఇంటికే పంపాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. . భూమే ప్రాణంగా, జీవితంగా, భవిష్యత్ గా భావించే రైతుల భూ వివాదాలు పరిష్కరిస్తాం. వారికి భద్రత, భరోసాను కల్పిస్తామని స్పష్టం చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *