క్రెడిట్ చోరీ చేయడంలో చంద్రబాబును మించిన వారు ఈ దేశంలో ఇంకొకరు లేరు:వై.ఎస్.జగన్ 

Spread the love

రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ కి FCRA పర్మిషన్లు రెన్యువల్‌ చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలకు ఏపీ మాజీ సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో విద్య, వైద్యం, పర్యావరణం, సామాజికాభివృద్ధిలో RDT సేవలు కొనసాగేందుకు, తద్వారా పేదల అభ్యున్నతికి ఈ అనుమతులు మేలుచేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. అయితే RDTకి FCRA అనుమతుల విషయంలో చంద్రబాబు క్రెడిట్‌ చోరీకి పాల్పడడం చాలా ఆశ్చర్యంగా ఉందని సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.  నిజంగా ఆయన కృషిచేసి ఉంటే,  ఏప్రిల్‌ 21, 2025లో నిలిచిపోయిన పర్మిషన్ల రెన్యువల్‌ కు ఏడాదికాలం ఎందుకు పట్టింది? అని ప్రశ్నించారు.  చంద్రబాబు పట్టించుకోకపోవడంవల్లే వైయస్సార్‌సీపీ సహా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజలు ఉద్యమం చేయాల్సి వచ్చిందన్నది వాస్తవం కాదా? ఇప్పుడు పబ్లిసిటీ స్టంట్స్ చేస్తూ క్రెడిట్ చోరీ చేయడంలో చంద్రబాబు గారిని మించిన వారు ఈ దేశంలో ఇంకొకరు లేరని విమర్శించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *