నిన్నటి భారీ నష్టాల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకుని భారీ లాభాలతో నేటి ట్రేడింగ్ ను ముగించాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు మరియు అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టవచ్చనే ఆశలతో మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ 1372 పాయింట్లు లాభపడి 74,068 పాయింట్ల వద్ద స్థిరపడగా.. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 399 పాయింట్ల లాభంతో 22,912 వద్ద ముగిసింది. డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ.93.79గా కొనసాగుతోంది. ఈరోజు మార్కెట్ ర్యాలీతో మదుపర్ల సంపద దాదాపు రూ.8 లక్షల కోట్లు పెరిగింది. రంగాల వారీగా చూస్తే బ్యాంకింగ్, ఆటో, మరియు ఐటీ రంగాలు మార్కెట్ రాణించడానికి ప్రధాన కారణమయ్యాయి. ఆసియా మరియు అమెరికా మార్కెట్ల నుండి వచ్చిన సానుకూల సంకేతాలు మన మార్కెట్ కు జోష్ ఇచ్చాయి.