స్టీల్ బ్రిడ్జి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి నారాయణ

Spread the love

అమరావతి రాజధాని ప్రాంతంలో కనెక్టివిటీని మరింత మెరుగుపరుస్తూ, అత్యంత కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డును మంగళగిరి రోడ్డుతో అనుసంధానించే పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఉండవల్లి వద్ద బకింగ్‌ హామ్ కెనాల్‌పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ నెలాఖరులోగా వాటిని పూర్తి చేయాలని కాంట్రాక్టరును ఆదేశించారు. గుంటూరు ఛానల్ మరియు కొండవీటి వాగుపై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జిలు కూడా పూర్తయితే, రాజధానిలోని ప్రధాన రహదారి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ కీలక ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు అవసరమైన 4.5 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చేందుకు రైతులకు ఏప్రిల్ 9 వరకు గడువు ఇవ్వబడిందని తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *