ప్రకృతి సాగు రైతు రోశయ్యకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. 75 సెంట్లలో 52 రకాల పంటలు సాగు చేస్తోన్న గుంటూరు జిల్లా, అత్తోటకు చెందిన రైతు రోశయ్య ఆదర్శంగా నిలవడమే కాక ప్రకృతి సేద్యంతో అద్భుతాలు సృష్టిస్తున్న రైతు రోశయ్యకు ప్రణామాలు తెలిపారు. భూమిని తల్లిలా భావించి… ప్రకృతి సేద్యంతో అద్భుతాలు సృష్టిస్తున్న గుంటూరు జిల్లా, కొల్లిపర మండలం, అత్తోట గ్రామ రైతు రోశయ్య గారికి నా ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఎనభై ఏళ్ల వయసులో కేవలం 75 సెంట్ల భూమిలో 52 రకాల పంటలు పండిస్తూ… నెలకు రూ.20 వేలకు పైగా ఆర్జిస్తున్న రోశయ్య గారి విజయగాధ స్ఫూర్తిదాయకమని చంద్రబాబు పేర్కొన్నారు. 2016లో ఏపీలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి నాడు తీసుకున్న చర్యలతో ప్రేరణ పొంది ప్రకృతి సాగు మొదలు పెట్టిన రోశయ్యగారు సాధిస్తున్న విజయాలు ఆదర్శమన్నారు. రోశయ్యగారికి హృదయపూర్వక అభినందనలు అంటూ చంద్రబాబు ‘ఎక్స్’ లో సదరు రైతు వీడియో పోస్ట్ చేశారు.