ఆవు నెయ్యి కొనుగోలుపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు పూర్తిగా ఖండిస్తున్నట్లు తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించడం బాధాకరమని KMF (నందిని) కేవలం 10 లక్షల కేజీలే సరఫరా చేయగలమని తెలిపిన కారణంగానే దేశవ్యాప్తంగా టెండర్లు పిలిచినట్లు వివరించారు. KMF నుంచే ₹716.92కి నెయ్యి కొనుగోలు జరిగింది. అధిక ధరల ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు. వైసీపీ రాజకీయ కుట్రను ప్రజలకు పూర్తిగా వివరిస్తామని స్పష్టం చేశారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.