ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ -2026 కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖకు వచ్చిన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము గౌరవార్ధం నేవీ అధికారులు ఇచ్చిన విందులో రాష్ట్ర ప్రభుత్వం తరుఫున గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్, రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డి వి బి స్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ సతీమణి శ్రీమతి అన్నాకొణిదెల కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులతోపవన్ కళ్యాణ్ ముచ్చటించారు. వారి కుటుంబాలతో కలిసి ఫోటోలు దిగారు. అంతకుముందు గవర్నర్ తో కలిసి డిప్యూటీ సీఎం పవన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు.