విభజన తర్వాత రాష్ట్రంలో అత్యంత దారుణంగ, మోసపూరితంగ, నిర్లక్ష్యంతో జాతీయ ఉపాధి హామీ పధకం అమలు జరిగిందని ఏపీసీసీ ఛీఫ్ వై.ఎస్.షర్మిల అన్నారు. పదేళ్ల బీజేపీ, టీడీపీ, వైసీపీ ద్రోహాల రిపోర్టు కార్డుకు ఈ రిపోర్టు నిలువుటద్దం పడుతుందని సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. అటు పనిదినాల నుండి నమోదు అయిన శాతం, అన్నింట దారుణమైన ఫలితాలు వెలగపెట్టి, గ్రామీణ పేదలను కూటమి, వైసీపీ పార్టీలు దారుణంగ వెన్నుపోటు పొడిచాయని రాష్ట్ర ప్రజలకు వారు బహిరంగంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చివరికి కూలి ఖర్చులు కూడా ఎంతో దారుణంగా పడిపోయాయి, దీనిబట్టి పల్లెల్లోని ఎస్సీ, ఎస్టీ బడుగుల పని ఆశలను ఎలా బుగ్గి పాలు చేశాయో ప్రజలే గమనించాలన్నారు. . నిర్దిష్ట ప్రణాళిక, నిబద్దత, నిజాయితీతో పేదల బాగుకోసం వైస్సార్ హయాంలో కాంగ్రెస్ ఊపిరిపోసిన ప్రాజెక్టులన్నా, పేదలన్నా మోడీ షాలకు ఎంత కక్షో స్పష్టమవుతోందని విమర్శించారు. అందుకే అలుపెరగకుండా జాతీయ ఉపాధి హామీ పరిరక్షణ కోసం పోరాటం చేస్తూనే ఉంటామని షర్మిల స్పష్టం చేశారు.