అభివృద్ధి మరియు ప్రజా సేవ కోసం ‘దేశమే ప్రథమం’ అనే భావనతో పనిచేయాలి

Spread the love

రాష్ట్ర సివిల్ సర్వీసెస్ నుండి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS)కి ఎంపికై, ప్రస్తుతం ఎల్.బి.ఎస్.ఎన్.ఏ.ఏ (LBSNAA)లో 128వ ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో పాల్గొంటున్న అధికారులు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు.ఈ సమావేశం రాష్ట్రపతి భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ  దేశ అభివృద్ధి ఫలితాలను ముందుకు తీసుకెళ్లడానికి మరియు ప్రజా సేవలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పడానికి అధికారుల సామూహిక వృత్తి నైపుణ్యం, సమన్వయం మరియు నిబద్ధత ఎంతో అవసరమని స్పష్టం చేశారు. అధికారులు తమ విలువైన అనుభవాన్ని అలాగే దేశమే ప్రథమం (నేషన్స్ ఫస్ట్) అనే స్ఫూర్తిని తమ మార్గదర్శక సూత్రాలుగా మలుచుకోవాలని ఆమె సూచించారు. వీరంతా 128వ ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కు చెందిన అధికారులు. కాగా, అభివృద్ధి మరియు ప్రజా సేవ కోసం ‘దేశమే ప్రథమం’ అనే భావనతో పనిచేయాలని రాష్ట్రపతి దిశా నిర్దేశం చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *