కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌ కు ఏపీ  సీఎం చంద్రబాబు లేఖ

Spread the love

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌ కు ఏపీ  సీఎం చంద్రబాబు లేఖ రాశారు.2025-26 రబీ సీజన్‌లో పండించిన మొక్క జొన్న పంటను కొనుగోలు చేయాలని కేంద్రమంత్రిని కోరిన ముఖ్యమంత్రి. మొక్కజొన్న రైతులకు ధరల వ్యత్యాస చెల్లింపు పథకాన్ని వర్తింప చేసి ఆదుకోవాలని కోరారు. రాష్ట్రంలో మొక్కజొన్న సాగు చేసిన రైతులు ఆందోళనగా ఉన్నారని మార్కెట్‌లో మొక్కజొన్న ధరలు రోజురోజుకూ పడిపోతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటాల్ మొక్కజొన్న ధర రూ.1600 నుండి రూ.1700 మధ్య మాత్రమే ఉంది.కనీస మద్దతు ధర రూ.2400 కంటే చాలా తక్కువగా ప్రస్తుత మార్కెట్ ధర ఉందన్నారు. రాష్ట్రంలో సుమారు 42.06 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇంకా 14.26 లక్షల మెట్రిక్ టన్నుల పంట కోత దశలో ఉంది.సకాలంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే రైతులు నష్టపోతారని వివరించారు. మొక్కజొన్న కొనుగోలుకు కేంద్రం నుంచి మద్దతు లేకపోవడంతో రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతుందన్నారు.  PM-AASHA కింద నేరుగా రైతులకు ధరల వ్యత్యాసాన్ని చెల్లించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ ను ప్రత్యేకంగా పరిగణించి, ధరల వ్యత్యాసంలో 100% నిధులను కేంద్రమే భరించాలన్నారు. ఈ పథకాన్ని జూన్ 2026 వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. నాఫెడ్, ఏపీ మార్క్‌ఫెడ్ సమన్వయంతో ఈ పథకాన్ని అమలు చేసేందుకు తక్షణమే అనుమతులివ్వాలి’ అని లేఖలో కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *