పక్కా ఆ రిలీజ్ డేట్ కే ‘పెద్ది’

Spread the love

టాలీవుడ్‌లో ప్రస్తుతం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి పెద్ది అని అందరికి తెలిసిందే కదా. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం గురించి ప్రతి చిన్న అప్‌డేట్ కూడా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఇప్పటికే రెండు సార్లు విడుదల వాయిదా పడటంతో అభిమానుల్లో కొంత నిరాశ ఏర్పడినా, ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఫైనల్ రిలీజ్ డేట్‌పై స్పష్టత రావడం పెద్ద ఊరటనిచ్చింది. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, సినిమా వర్గాల్లో ఒక వార్త గట్టిగా వినిపిస్తోంది… అదే పెద్ది చిత్రం జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని. ఈ వార్త మొదట గాసిప్‌లా మొదలైనప్పటికీ, తాజాగా దీనిపై అధికారికంగా క్లారిటీ రావడంతో అది నిజమని తేలిపోయింది. ఈ స్పష్టతను ఇచ్చింది ఎవరో కాదు… ఏకంగా సినిమా దర్శకుడు బుచ్చిబాబు సాన. ఇటీవల జరిగిన ఒక మూవీ ఈవెంట్లో ఈ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన కర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బుచ్చిబాబు అతిథిగా హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో అభిమానులు పెద్ద ఎత్తున హాజరై, తమ అభిమాన హీరో రామ్ చరణ్ సినిమా పెద్ది గురించి అడగడం ప్రారంభించారు. “రిలీజ్ ఎప్పుడు?” అంటూ గోల చేస్తూ దర్శకుడిని ప్రశ్నించారు. ఆ సమయంలో బుచ్చిబాబు చిరునవ్వుతో స్పందిస్తూ, “ఏ పరిస్థితుల్లోనైనా జూన్ 25న ‘పెద్ది’ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది” అని స్పష్టం చేశారు. ఈ మాటలు వినగానే అక్కడ ఉన్న అభిమానులు ఆనందంతో ఊగిపోయారు. ఇది కేవలం ఒక రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ మాత్రమే కాదు, అభిమానులకు ఒక నమ్మకం కూడా. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమా రెండు సార్లు వాయిదా పడటంతో చాలామంది “మరలా వాయిదా పడుతుందా?” అనే అనుమానంతో ఉన్నారు. కానీ దర్శకుడు ఇచ్చిన ఈ క్లారిటీతో ఆ అనుమానాలకు ఫుల్ స్టాప్ పడింది. ప్రేక్షకులకు ఒక మంచి అవుట్‌పుట్ ఇవ్వాలంటే కొంత సమయం తీసుకోవడం తప్పు కాదు. త్వరగా విడుదల చేయడం కంటే, క్వాలిటీతో కూడిన సినిమా ఇవ్వడం ముఖ్యం. ఇదే ఆలోచనతో బుచ్చిబాబు ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నట్టు తెలుస్తోంది. జాన్వీ కపూర్ ఈ సినిమాలో కథానాయికగా కనిపించనున్నారు.  శివరాజ్ కుమార్, జగపతి బాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *