మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) పరిరక్షణ యాత్ర నేడు పల్నాడు జిల్లాలో కొనసాగుతోంది. వినుకొండ నియోజకవర్గం, వేల్పూరులో జరిగిన రచ్చబండ కార్యక్రమానికి గ్రామస్తులు హాజరయ్యారు. హాజరై కరువు పనిపై కేంద్రం చేసిన కుట్రలను వివరించారు. కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టీడీపీ,వైసీపీల పాలనలో ఏనాడు కూడా 100 రోజుల పాటు పని ఇవ్వలేదని, తమ గ్రామంలో 20 రోజులు పని ఇచ్చిందే ఎక్కువని, చేసిన పనికి సైతం వేతనాలు గడువు ప్రకారం చెల్లించలేదని,కరువు పనిపైనే బ్రతికే వారి కార్డులు చెప్పాపెట్టకుండా తొలగించారని గ్రామానికి చెందిన ఉపాధి హామీ శ్రామికులు లక్ష్మమ్మ, పుల్లారెడ్డి, దేవయ్యలు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీసీసీ ఛీఫ్ షర్మిల బహిరంగ సభ ద్వారా మన్రేగా పథకం లబ్ధిని వివరించారు. అలాగే, ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం VB G- RAM G పథకం పై విమర్శలు గుప్పించారు. స్థానిక ప్రజలకు వివరించారు. ఉపాధి హామీ పథకం పునరుద్ధరణకు డిమాండ్ చేశారు.