భోగాపురం ఎయిర్‌పోర్ట్ చారిత్రాత్మక ఘట్టం…జనవరి 4న తొలి విమానం ల్యాండింగ్!

Spread the love

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మరో అద్భుత మైలురాయిని చేరుకోబోతోంది. వచ్చే ఏడాది జనవరి 4న ఈ విమానాశ్రయం రన్‌వేపై తొలి విమానం ల్యాండ్ కానుంది.ఈ చారిత్రక ఘట్టంలో భాగంగా ఢిల్లీ నుండి వచ్చే తొలి విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు,విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు రానున్నారు. ప్రస్తుతం విమానాశ్రయంలో రన్‌వే పనులు తుది దశకు చేరుకోగా, ఏటీసీ (ATC) టవర్, టెర్మినల్ భవనాల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి.ఈ ట్రయల్ రన్ విజయవంతమైతే, ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఒక కీలక మలుపుగా మారనుంది. పర్యాటక, పారిశ్రామిక రంగాలకు ఊతమిచ్చే ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయి.