హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ ప్రాంతంలో డ్రగ్స్ కలకలం రేపింది.కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకోవడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.కాగా ఒక ప్రైవేట్ ప్రాంతంలో డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారంతో తెలంగాణ పోలీసుల ప్రత్యేక విభాగం ‘ఈగల్ టీం’ మెరుపు దాడులు నిర్వహించింది.ఈ తనిఖీల్లో సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడినట్లు సమాచారం.
వెంటనే అతనికి నిర్వహించిన డ్రగ్స్ నిర్ధారణ పరీక్షల్లో రిజల్ట్ పాజిటివ్‌గా రావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.అనంతరం సుధీర్ రెడ్డిని నర్సింగి పోలీసులకు అప్పగించి,తదుపరి విచారణ నిమిత్తం డి-అడిక్షన్ సెంటర్‌కు తరలించినట్లు తెలుస్తోంది.గతంలో మంత్రిగా పనిచేసిన ఆదినారాయణ రెడ్డి కుమారుడు ఇలా డ్రగ్స్ కేసులో చిక్కడం చర్చనీయాంశమైంది.ఈ ఘటనపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.