నేడు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు, విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లు శుభాకాంక్షలు తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబు:
జనసేన పార్టీ 13 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారికి శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధిలో, తెలుగు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో జనసేన పోషిస్తున్న పాత్ర అభినందనీయం. ప్రజలకు అండగా నిలుస్తూ వారి భవిష్యత్ కోసం పనిచేస్తున్న జనసైనికులకు, వీరమహిళలకు, నేతలకు శుభాభినందనలు.
మంత్రి నారా లోకేష్:
జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జనసేన ఏడు సిద్ధాంతాలతో ప్రజాజీవితాల్లో భాగం కావడం చాలా సంతోషం. ఈ శుభసందర్భంలో జనసేనాని పవనన్నకు, నేతలు, కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు.