జాతీయ పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న పురందేశ్వరికి ఝలక్..!

Spread the love

Former AP BJP president Purandeswari: జాతీయ పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షురాలు పురందేశ్వరికి ఝలక్ తగలనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షురాలిగా తనను ఎంపిక చేస్తారన్న ఆశలపై ఓ సంఘటన నీళ్లు చల్లేసిందట. దీంతో తాను ఏదో అనుకుంటే మరేదో అయిందన్న ఫీలింగులో ఉన్నారట పురందేశ్వరి.

బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిపై ఈసారి మహిళకు ఇస్తున్నారు. దీనిపై ఆ పార్టీ పెద్దలు కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఇక రేసులో ప్రధానంగా ముగ్గురి పేర్లు వినిపించాయి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, తమిళనాడులోని కోయంబత్తూరు సౌత్ ఎంఎల్ఏ వానతి శ్రీనివాసన్, పురందేశ్వరి పేర్లు ఉన్నాయి. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి పురందేశ్వరి తప్పుకున్న సమయంలో ప్రస్తుత అధ్యక్షుడు మాధవ్ ఓ కీలక కామెంట్ చేశారు. జాతీయ రాజకీయాల్లో పురందేశ్వరి కీలక బాధ్యతలను త్వరలోనే చేపడతారంటూ కామెంట్ చేశారు. దీంతో పురందేశ్వరికి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఖాయమంటూ ప్రచారం కూడా జరిగింది.

ఇక తమిళం, మళయాళంతో పాటు హిందీ కూడా పురందేశ్వరికి మాట్లాడటం తెలుసు. దీంతో దక్షణాది రాష్ట్రాల్లో బాగా పరిచయాలు ఉన్నాయి. ఇవన్నీ ఆమెకు ప్లస్ అవుతాయన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఇప్పటి దాకా అలాంటి వార్త ఏదీ బయటకు రాకపోవడంతో ఆమె టెన్షన్ పడుతున్నారట. ఇదే సమయంలో మరో వార్త ఆమెను కుంగదీసినట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ ఉప రాష్ట్రపతి ధన్కర్ వ్యవహార శైలి, చేష్టలు బీజేపీతో పాటు కేంద్రానికి అప్రతిష్ట తెచ్చాయి. దీంతో సీరియస్ అయిందట సంఘ్ పరివార్. సంఘ్ పరిచయం లేని ఏ వ్యక్తికీ పార్టీలో కానీ, పాలనలో కానీ కీలక పదవి ఇస్తే తాట తీస్తామని ప్రధాని మోడీతో పాటు బీజేపీ అగ్రనాయకత్వానికి గట్టిగా వార్నింగ్ ఇచ్చిందట. అలాగే ఎంత గట్టి నాయకుడైనా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లను కూడా అతిగా ప్రోత్సహించవద్దని తేల్చి చెప్పిందట సంఘ్ పరివార్. Former AP BJP president Purandeswari.

సంఘ్ పరివార్ వార్నింగుతో బీజేపీ పెద్దలకు తత్వం బోధపడింది. ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి వందసార్లు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ విషయంలో కూడా రాష్ట్ర అధ్యక్ష పదవికి ఈటలను దూరం పెట్టడానికి కూడా ఇదే కారణంగా తెలుస్తోంది. ఇదే సమయంలో పురందేశ్వరి విషయంలో కూడా బీజేపీ పెద్దలు ఆలోచనలో పడ్డారట. ఎందుకంటే, ఆమెది సంఘ్ బ్యాకప్ కాదు. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ పార్టీలో పనిచేసిన కుటుంబ నేపథ్యం. కాకపోతే దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంఘ్ సానుభూతి పరుడు మాత్రమే. దీంతో కొంచెం పరిచయాలు ఉండటం సహజం.అలాఅని పూర్తిగా సంఘ్ కుటుంబం కాదు. మరో విషయం ఏంటంటే, ఏపీలో బలంగా ఉన్న కమ్మ సామాజికవర్గానికి చెందిన పురందేశ్వరితో ఒరిగేమీ లేదు. ఆ సామాజికవర్గం మొత్తం టీడీపీతోనే ఉంటుంది. అలాంటప్పుడు ఇప్పుడు పురందేశ్వరికి జాతీయ బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చి ఉపయోగం ఏంటన్న ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరో విషయం ఏంటంటే, వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలు బీజేపీకి చాలా కీలకం. ఇప్పటికే ఏఐడీఎంకేతో పొత్తు కన్ఫాం అయింది. ఆ పార్టీ కూడా మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని దూరం చేసుకుని ఘోరంగా దెబ్బతింది. దీంతో రాబోయే శాసనసభ ఎన్నికల్లో బీజేపీతోనే వెళ్తామిన అన్నాడీఎంకే క్లారిటీ ఇచ్చేసింది. ఇలాంటి సమయంలో తమిళనాడుకు చెందిన వారికే జాతీయ అధ్యక్ష పదవి ఇవ్వడం కరెక్టని సంఘ్ పరివార్ ఆలోచనగా తెలుస్తోంది. దీంతో రేసులో ఉన్న నిర్మలా సీతారామన్, వనతి శ్రీనివాసన్ ఇద్దరిలో ఒకరికి పదవి గ్యారెంటీగా అర్థం అవుతోంది. అయితే నిర్మలా సీతారామన్ మాస్ లీడర్ కాదు. కానీ వనతి శ్రీనివాసన్ అలాకాదు. ఇప్పటికే ఆమె బీజేపీ మహిళామోర్చా జాతీయ అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఆమెకు బాగా పరిచయాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి వనతి శ్రీనివాస్ కు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు పురందేశ్వరికి తగిలిన ఝలక్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Also Read: https://mega9tv.com/andhara-pradesh/how-much-truth-is-there-in-the-news-that-ysrcp-chief-jaganmohan-reddy-will-be-arrested-in-august/