ప్రజల్లోకి ప్రభుత్వ విధానాలు సమర్ధంగా వెళ్లాలి:ఏపీ సీఎం చంద్రబాబు

Spread the love

రెండు రోజుల జిల్లా కలెక్టర్ల సమావేశం నేడు రాష్ట్ర సచివాలయంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగానికిసీఎం దిశా నిర్దేశం చేశారు. గవర్నమెంటు అందిస్తున్న స్కీమ్ లను, చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజల్లో ప్రచారం కల్పించాలని అలాగే అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఇటీవల చోటుచేసుకున్న పలు ఘటనలపై సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వేట్లపాలెం బాణాసంచా పేలుళ్లు, శ్రీకాకుళంలో డయేరియా,  రాజమహేంద్రవరంలో కల్తీ పాల ఘటనలపై స్పందించారు.  ప్రభుత్వం పేదల కోసం పని చేస్తోందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సీఎం స్పష్టం చేశారు.ప్రతీ మూడు నెలలకూ పాలనా అంశాలపై సమీక్ష చేసుకుని ముందుకు వెళ్తున్నాం. ఉన్న పరిమిత వనరులతోనే సంక్షేమం, అభివృద్ధి, గుడ్ గవర్నెన్స్ ను  బ్యాలెన్సు చేస్తున్నాం.  గడచిన 20 నెలల్లో కీలకమైన పాలనా మార్పులు తీసుకువచ్చాం. ప్రభుత్వం తెచ్చే విధానాలు దీర్ఘకాలంలో ప్రభావం చూపిస్తాయి. వీటి అమలులో ఉదాసీనత వద్దని సూచించారు.  సూపర్ సిక్స్ సహా వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయాలి. ఎక్కడా చిన్న పొరపాటు కూడా దొర్లకుండా పారదర్శకంగా అమలు చేయాలన్నారు. 13 తేదీన అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు విడుదల చేస్తున్నాం. కేంద్రం ఇచ్చే వాటితో పాటు రాష్ట్రం కూడా రైతుల అకౌంట్లలో  మిగతా నగదు జమ చేస్తుంది. ప్రజల్లోకి వెళ్లి… ఈ పథకం గురించి చెప్పాలి.. డబ్బులు విడుదల చేస్తున్నామని వివరించాలన్నారు.  ఖరీఫ్ సాగు కోసం మే 15 తేదీన నీటిని విడుదల చేస్తున్నాం. సీజన్లో ముందుగానే నీరు అందిస్తామని స్పష్టం చేశారు.  ఉగాది కానుకగా 2.50 లక్షల లబ్దిదారులకు సామూహిక గృహ ప్రవేశాలు చేయిస్తామని స్పష్టం చేశారు.  జూన్ నెలలో మరికొన్ని ఇళ్లను లబ్దిదారులకు ఇస్తామన్నారు. ఇల్లు, ఇంటి జాగా కూడా మూడేళ్లలో ఇవ్వాల్సి ఉంది. ఇంద్ర ధనస్సు పేరిట దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు మరికొన్ని కార్యక్రమాలు అమలు చేయబోతున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం  ట్రూ ఆప్ పేరిట విద్యుత్ చార్జీల భారం వేశారని  తొలిసారి ట్రూ డౌన్ చేసినట్లు తెలిపారు.  రూ.4,600 కోట్ల భారాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తోందన్నారు.  విద్యుత్ ఉత్పాదన ఓ సంపాదనా మార్గంగా మారాలని  విద్యుత్ వినియోగదారులు.. విక్రయదారులుగా మార్చేలా రూపొందించిన ప్రణాళికను సక్సెస్ చేయాలన్నారు.  వన్ ఫ్యామిలీ, వన్ ఎంట్రప్రెన్యూర్ కింద 1.12 లక్షల మంది మహిళా మైక్రో ఎంట్రప్రెన్యూర్లను తయారు చేశామని పేర్కొన్నారు. వచ్చే ఏడాదికి 5 లక్షల మంది మహిళలను ఇండస్ట్రియలిస్ట్ లుగా  తీర్చిదిద్దేలా లక్ష్యంగా పెట్టుకున్నాం. 2047 నాటికి ప్రతీ వెయ్యి మందికి ఒక స్టార్టప్ ఏర్పాటు చేసుకునేలా టార్గెట్ పెట్టుకుందాం. నీటి భద్రత కోసం చేపట్టిన చర్యలు మంచి ఫలితాలు ఇచ్చాయన్నారు. వెలిగొండను జూలై నాటికి పోలవరం ప్రాజెక్టును 2027లో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులు ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తాం. 2027 మార్చి నాటికి భూవివాదాలు లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేస్తామన్నారు. 

ప్రజల ప్రాణాల పట్ల ఉదాసీనత ఉంటే సహించమని స్పష్టం చేశారు.  మార్చి 23వ తేదీన అర్సెలార్ మిట్టల్ ప్రాజెక్టును శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రజల్లోకి ప్రభుత్వ విధానాలు సమర్ధంగా వెళ్లాలి. పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీపై చర్చ జరగాలి. పీ4 కూడా ఓ గేమ్ చేంజర్ అని పేర్కొన్నారు. కలెక్టర్లు పీ4ను మానిటర్ చేయాలన్నారు. 2047కి రూ.55 లక్షల తలసరి ఆదాయం వచ్చేలా చూడాలి. మహిళ సంఘాలు తయారు చేసే ఉత్పత్తులు స్వయం బ్రాండ్ తో మార్కెటింగ్ చేసేలా దృష్టి పెట్టాలి. ఇరాన్ సహా ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధ ప్రభావాలు మనపై కూడా పరోక్షంగా పడుతోంది. ప్రవాసాంధ్రులు వేర్వేరు దేశాల్లో విస్తరించి ఉన్నారు. గుడ్లు, అరటి లాంటి ఉత్పత్తుల ధరలు ఈ కారణంగా పడిపోతున్నాయి. ప్రత్యామ్నాయ మార్కెట్లకు మన ఉత్పత్తులు చేరుకోవాలి. శాంతిభద్రతల విషయంలో రాజీ పడేదే లేదన్నారు.  గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగంలో కేపీఐలు మెరుగు పడాలన్నారు. మన యువతకు నైపుణ్యాభివృద్ధి విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్లు వివరించారు.  ఐటీ, క్వాంటం, ఏఐ వంటి రంగాల్లో కొత్త టెక్నాలజీలు, ల్యాబులు ఏర్పాటు చేస్తున్న విధంగానే వ్యవసాయానికి మరింత ఊతమిచ్చేలా అలాంటి వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ క్రమంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తరహాలోనే ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు చేద్దామని సీఎం ప్రకటించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *