విజయవాడలో కాల్పుల ఘటన కలకలం రేపింది. కార్డన్ సెర్చ్ చేస్తున్న పోలీసులు, ఈగల్ అధికారులపై కాల్పులు జరిగిన ఘటన నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. బస్ స్టాండ్ సమీపంలో బాలాజీ హోటల్ తనికీలు చేస్తూ ఉండగా ఫైరింగ్ చోటుచేసుకుంది. ట్రిగ్గర్ ప్రెస్ చేయకపోవడంతో బులెట్ ఛాంబర్ లోకి రాలేదని పోలీసులు గుర్తించచారు. గన్ తో కాల్పులకు తెగబడిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రం వరంగల్ నేలిగూడూర్ కు చెందిన వాడిగా గుర్తించారు. గన్ తో కాల్పులు జరిపి పారిపోతుండగా పోలీసులు, ఈగల్ అధికారులు వెంటబడి పట్టుకున్నారు. 9 MM టైప్ పిస్టల్ తో పాటు ఐదు రౌండ్లు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అతి కష్టం మీద అరెస్టు చేసి టాస్క్ఫోర్స్ ఆఫీసుకు తరలించారు.