పెర్త్ వేదికగా ఆస్టేలియా తో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 198 పరుగులకే ఆలౌటైంది. మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందు బ్యాటింగ్ చేసిన భారత్ 62.4 ఓవర్లలో 198 పరుగులకే మొదటి ఇన్నింగ్స్ ను ముగించింది. జెమీమా రోడ్రిగ్స్ 52 (84; 7×4), షెఫాలీ వర్మ 35 (48), కాశ్వీ గౌతమ్ 34 నాటౌట్ (54; 3×4) మినహా ఎవరూ పెద్దగా పరుగులు చేయలేదు. ఆస్ట్రేలియా బౌలర్లలో అన్నాబెల్ సుతర్లాండ్ 4 వికెట్లు, లూసీ హామిల్టన్ 3 వికెట్లు, డార్సీ బ్రౌన్ 2 వికెట్లు, ఆష్లే గార్డనర్ 1 వికెట్ పడగొట్టారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి 96 పరుగుల వద్ద నిలిచింది.