మన సంప్రదాయాలను గౌరవిస్తూనే, సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందంజలో ఉన్న మన రైతులను చూసి గర్విస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. బిల్ గేట్స్ రాష్ట్ర పర్యటనకు వచ్చిన నేపథ్యంలో ఈ రోజు ఉండవల్లిలో మిస్టర్ గేట్స్ తో ఒక కార్యక్రమంలో రైతులతో పాల్గొన్న అంశానికి సంబంధించి సోషల్ మీడియాలో పంచుకున్నారు. రైతులు ఆయనకు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికిన అనంతరం, వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రదర్శించి బిల్ గేట్స్ ను ఆకట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు వారి పంటలు, మార్కెట్ ధరలు మరియు భూసార పరిస్థితుల ఆధారంగా AI (కృత్రిమ మేధ) ద్వారా రూపొందించిన ఖచ్చితమైన సలహాలను అందిస్తోందని తెలిపారు. వీటితో పాటు, ప్రకృతి వ్యవసాయం మరియు స్థిరమైన సాగు పద్ధతులను కూడా యాక్టివ్ గా ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.