అమరావతి చట్టబద్దత బిల్లుకు లోక్ సభ ఆమోదం 

Spread the love

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్దత బిల్లుకు లోక్ సభ ఆమోదించింది. ఏపీ పునర్విభజన చట్టసవరణ పేరుతో కేంద్రమంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. దీనిపై సుమారు రెండు గంటలు చర్చ జరిగింది. టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్, వైసీపీ, సమాజ్ వాదీ పార్టీ ఎంపీలు చర్చలో పాల్గొన్నారు. ఆ తర్వాత బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపినట్లు స్పీకర్ ప్రకటించారు. ఇక ఈ బిల్లు రేపు రాజ్యసభ ముందుకు రానుంది. ఇక ఇటీవల అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ఎవరూ కదిలించలేని దిశగా  ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన అమరావతి చట్టబద్దత ప్రభుత్వ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ తీర్మానం ద్వారా రాజధాని విషయంలో గతంలో జరిగినవి పునరావృతం కాకుండా  అమరావతికి పూర్తిస్థాయి రాజ్యాంగబద్ధమైన గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం తీర్మానించింది. ఈ చారిత్రాత్మక తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ  ఏకగ్రీవంగా ఆమోదించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *