ముంబైలో జరిగిన దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ సానియా ఛందోక్ ల వివాహ రిసెప్షన్‌లో ఆంధ్రప్రదేశ్ విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దంపతులు పాల్గొన్నారు. ఈమేరకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ వేడుకల్లో పాల్గొనడం, అలాగే ముఖేష్ అంబానీ, ఐసీసీ ఛైర్మన్ జై షా మరియు ఇతర మిత్రులను కలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అర్జున్ టెండూల్కర్ జీవితాంతం సంతోషంగా ఉండాలని, మరెన్నో విజయాలను అందుకోవాలని మరియు క్రికెట్ రంగంలో అద్భుతమైన ప్రయాణాన్ని కొనసాగించాలని లోకేష్ ఆకాంక్షించారు.