ఆసక్తికరంగా వృషకర్మ గ్లిమ్ప్స్ 

Spread the love

‘తండేల్’ వంటి సక్సెస్ ఫుల్ సినిమా తర్వాత యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్  ‘వృషకర్మ’. ‘విరూపాక్ష తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న  కార్తీక్ దండు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్స్ నిర్మిస్తున్నాయి. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర గ్లింప్స్ ను  నేడు విడుదల చేశారు. ఈ మూవీపై అంచనాలు పెంచే విధంగా ఈ గ్లిమ్ప్స్ ఉంది. గ్రాఫిక్స్ తో అదరగొట్టారు. కథా నేపథ్యం కూడా సరికొత్తగా కనిపిస్తోంది. ఈ గ్లింప్స్ ఈ చిత్ర ప్రపంచాన్ని.. దీని కథను ప్రేక్షకులకు పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. నాగ చైతన్య  ఈ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ లో అర్జున్ అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు అజనీష్ లోక్ నాథ్ సంగీతం సమకూరుస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *