మంగళగిరిలో రేపు మెగా జాబ్ మేళా

Spread the love

మంగళగిరి V.T.J.M & I.V.T.R డిగ్రీ కళాశాలలో రేపు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు.  యువతకు ఉపాధి అవకాశాలు అందించడమే మంత్రి నారా లోకేష్ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. మంగళగిరి లో జరగనున్న ఈ జాబ్ మేళాలో 15 కు పైగా కంపెనీలు పాల్గొననున్నాయి.  మొత్తం 590 మందికి ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, B.Tech వంటి అర్హతలున్న 18 నుండి 40 ఏళ్ల మధ్య వయస్సు గల నిరుద్యోగులు అవసరమైన ఆధార్, సర్టిఫికేట్లు, ఫోటోలు, బయోడేటాతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు, ఎంపికయ్యే వారికి నెలకు ₹10,000–₹50,000 వరకు వేతనాలు లభించనున్నాయి.

*జాబ్ మేళా వివరాలు*:

తేదీ: 13-02-2026

సమయం: ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు

స్థలం: V.T.J.M & I.V.T.R డిగ్రీ కళాశాల, మంగళగిరి

రిజిస్ట్రేషన్ కోసం అభ్యర్థులు నైపుణ్యం పోర్టల్ (naipunyam.ap.gov.in) ద్వారా నమోదు చేసుకోవచ్చును,మరిన్ని వివరాల కోసం 9966788993,8074597926,7780588993) నంబర్లను సంప్రదించవచ్చు. జాబ్ మేళా రోజు ప్రత్యక్ష రిజిస్ట్రేషన్‌ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు.