ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న MGNREGA పరిరక్షణ యాత్ర

Spread the love

ఏపీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిల చేపట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట(MGNREGA) పరిరక్షణ యాత్ర నేడు ప్రకాశం జిల్లాలో కొనసాగుతుంది. కొండెపి నియోజక వర్గం,పాకల గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఉపాధి హామీ శ్రామికుల ఆవేదన వర్ణనాతీతమని  ఆనాడు వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ హయాంలో కరువు పనంటే పండుగేనని, రవాణా చార్జీలతో పాటు పనులు జరిగే మంచినీళ్లు, మజ్జిగ, రస్నా లాంటివి ఇచ్చేవారని, ఇప్పుడు వందరోజుల్లో సగం రోజులు కూడా పని ఇచ్చే దిక్కులేదని వాపోతున్నారని షర్మిల సోషల్ మీడియా లో పేర్కొన్నారు. చేసిన పనికి సైతం వేతనాలు ఎప్పడు ఇస్తారో తెలియదన్న పాకల గ్రామ ప్రజలు కాంగ్రెస్ చేస్తున్న పరిరక్షణ పోరాటానికి మద్దతుగా నిలిచారు. VB G – RAM G చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మన్రేగా పథకం కొనసాగాలని చెప్పారని తెలిపారు. 

రాహుల్ సభ్యత్వం రద్దుకు బీజేపీ డిమాండ్ చేయడం సిగ్గుచేటు

విపక్ష నేత రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దుకు బీజేపీ డిమాండ్ చేయడం సిగ్గుచేటని ఆమె మండిపడ్డారు. ప్రశ్నించే గొంతుకను చంపాలని చూసే కుట్ర ఇది.  దేశ ప్రతిపక్ష నేతపై సబ్ స్టాంటివ్ మోషన్ పెట్టడం మోదీజి నిరంకుశత్వానికి పరాకాష్ట. అమెరికా ట్రాప్ డీల్ పై రాహుల్ జి నిజాలు చెప్తే  మోదీజీ వణుకుతున్నారు. అందుకే సభాహక్కుల పేరుతో రాహుల్ గాంధీ గారి గొంతు నొక్కాలని చూసున్నారని ‘ఎక్స్’ వేదికగా ఫైర్ అయ్యారు.