తాజ్ ప్యాలస్ లో జరుగుతోన్న సీఐఐ బిజినెస్ సమ్మిట్ కు ఏపీ సీఎం హాజరై ప్రసంగించారు. సీఐఐతో సుదీర్ఘ అనుబంధం ఉందని అన్నారు. పెట్టుబడుల గురించి సీఐఐతో కలిసి పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. దేశ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలే తన అజెండా అని స్పష్టం చేశారు. నాలెడ్జీ, టెక్నాలజీ, ట్రస్ట్, స్పీడ్ అనే వాటిపై ప్రపంచ వ్యాప్తంగా పోటీ ఉందన్నారు. ఇండస్టీల ఎకోసిస్టమ్, ఇన్వెస్ట్మెంట్స్ ఆకర్షించేందుకు సీఐఐ చాలా కృషి చేసిందని పేర్కొన్నారు. 1990లో వచ్చిన సంస్కరణలను అందిపుచ్చుకుని అంతా ముందుకు సాగిన విషయాన్ని ప్రస్తావించారు. క్వాంటం, ఏఐ, అడ్వాన్స్డ్ మాన్యుఫాక్చరింగ్, ఇంటెలిజెంట్ లాజిస్టిక్స్ రంగాలను అందిపుచ్చుకునేలా పనిచేస్తున్నట్లు తెలిపారు. వేర్వేరు రంగాల్లో గ్లోబల్ ట్యాలెంట్ కూడా మనకు ఉందని అన్నారు. దేశానికి సరైన చోట సరైన నాయకుడుగా ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారుఆర్ధిక సంస్కరణలు దేశానికి చాలా అవకాశాలు కల్పించాయి. చాలా ఆవిష్కరణలకు కారణం అయ్యాయని పేర్కొన్నారు. టెలికామ్ డీరెగ్యులేషన్, ఓపెన్ స్కై పాలసీ, విద్యుత్ సంస్కరణలు, హైవేలు లాంటి విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని ఈ సంస్కరణల్లో నేభాగం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో సుస్థిరమైన ప్రభుత్వాలు ఉన్నాయని పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. సంస్కరణల వాది అయిన ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ అగ్రస్థానానికి చేరుతుందన్నారు. ఇటీవల ప్రధాని మోడీ ప్రజలకు ఇచ్చిన సూచనలను ప్రస్తావించారు. యుద్ధానంతర పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు మనం చూశామని అన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అన్న నినాదాన్ని కూడా ప్రధాని ఇచ్చారు. దానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు మనకు ఉన్నాయి. అలాగే గ్రేటర్ సెల్ఫ్ రిలయన్స్ అనే అంశాన్ని ప్రధాని పేర్కొన్నారు. నేచురల్ ఫార్మింగ్ అన్నది ఓ కీలకమైన అంశంగా మారింది. దీని వలన ఎరువుల దిగుమతి తగ్గుతుంది. మనం స్వయం సమృద్ధి సాధిస్తాం. ఈ నేషనల్ టాస్క్ ను మనం అంతా కలిసి సాధించాలన్నారు. ప్రతీ సవాలూ ఓ అవకాశాన్ని మనకు సృష్టిస్తుంది. భారత్ ఇక అన్ స్టాపబుల్ , దేశం ఓ గ్లోబల్ జెయింట్ గా మారుతుందని స్పష్టం చేశారు.