
Arundhati Kota Special Story: అరుంధతి సినిమా అంటేనే మన అందరికీ గుర్తుకు వచ్చేది ఆ అద్భు తమైన కోట. తెరపై భయానకంగా, రహస్యం గా కనిపించినా… వాస్తవా నికి అది ఒక చారిత్రక కట్టడం అని చెప్పవచ్చు..పర్యాటకులు ఇప్పటికి ఆ కోటను అరుంధతి బంగ్లా గానే పిలుస్తారు.. ఎంతో పేరుగాంచిన ఆ పురాతన కోట ఎక్కడ ఉంది.. దాని చరిత్ర ఏంటో తెలుసుకోవా లంటే ఈ స్టోరీ చూడాల్సిందే..
నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం పాతపాడు గ్రామ శివారు లో ఉన్న ఈ నవాబు కోటకు 120 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ బంగ్లాను బనగానపల్లి చివరి నవాబు అయిన మీర్ ఫజల్ అలీ ఖాన్ సుమారు 120 ఏళ్ల క్రితం నిర్మించారు. ఆ కాలంలో ఇది వైభవం, శిల్పకళ, విలాసాల ప్రతీక అని చెప్పవ చ్చు..కాలక్రమేణా నవాబు పాలన ముగిసినా, ఈ కట్టడం మాత్రం ఎన్నో కథలు, జ్ఞాప కాలను తన గోడలలో దాచుకుంది.
అరుంధతి సినిమా తో ఈ బంగ్లా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత అనేక తెలుగు, తమిళ సినిమా లు, టీవీ సీరియళ్లు ఇక్కడ చిత్రీకరించ బడ్డాయి. ఓపెన్ ఏరియాస్, రహస్య మార్గాలు, పాతకాలపు డిజైన్, ఇవన్నీ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ కోటను చూసేందుకు నిత్యం పర్యా టకులు ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు. బనగానపల్లి నియోజకవర్గానికి వస్తే ఖచ్చితంగా ఈ అరుంధతి కోటను చూడకుండా వెళ్లరు..
అద్భుతమైన ఈ కట్టడం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంటుంది.గోడలు పగిలి పోవడం తో పాటు పైకప్పు కూలిపోతోంది, నవాబు వారసు లమని చెప్పుకునే వారు, సందర్శ కుల దగ్గర రుసుము వసూలు చేస్తున్నారు తప్ప ఈ కట్టడo సంరక్షణకు మాత్రం పట్టించుకోవడం లేదు. కోట శిథిలావస్థకు వస్తుందన్న విషయం ఎవరికీ చెప్పొద్దని కోట లోపలికి ప్రవేశించే వారికి వార్నింగ్ ఇస్తూ పంపిస్తున్నారు. Arundhati Kota Special Story.
ఒకప్పుడు తెరపై మాయ, భయం, రహస్యం నింపిన ‘అరుంధతి బంగ్లా’… నిజజీవి తంలో మాత్రం కాల పు దెబ్బలకు ఓటమి అంగీక రిస్తోంది. సరైన సంరక్షణ లేకుం టే, మన చరిత్రలోని మరో అందమైన పుట శూన్యమ వ్వడం ఖాయనే చెప్పాలి..
Also Read: https://mega9tv.com/andhara-pradesh/pd-act-against-ycp-leader-dal-mil-suri/