గుంటూరు అభివృద్ధి పనులపై స్థానిక ఎమ్మెల్యేలతో కేంద్రమంత్రి సమీక్ష

Spread the love

గుంటూరు నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై స్థానిక ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నజీర్ అహ్మద్ గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్రతో కలిసి కలెక్టరేట్‌ లో గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్  సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పడిన గత 20 నెలల్లో గుంటూరు పరిధిలో దాదాపు రూ.400 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షిస్తూ, ముఖ్యంగా శంకర్ విలాస్ బ్రిడ్జ్, ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్–3, నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం, శానిటేషన్ మరియు వాటర్ సప్లై వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. రాబోయే 1–2 సంవత్సరాల్లో గుంటూరును మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *