Rahul Allegations on Election Process: భారత ఎన్నికల వ్యవస్థపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఎలక్షన్ కమిషన్ పనితీరుపైనే ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. కర్ణాటక, మహారాష్ట్రలో నకిలీ ఓటర్లు, ఓటింగ్ లెక్కల్లో అవకతవకలు జరిగాయని తీవ్ర ఆరోపణలు చేశారు. అసులు ఈసీపై రాహుల్ గాంధీకి వచ్చిన అనుమానం ఏంటి..? దీనిపై ఎన్నికల కమిషన్, బీజేపీ ఎలా స్పందించింది? ఈ వివాదాల వెనుక వాస్తవాలు ఏమిటి?
దేశంలో వరుస ఓటములు చూస్తోన్న కాంగ్రెస్ పార్టీ.. మొదటి నుంచి ఎన్నికల కమిషన్ పై విమర్శలు చేస్తోంది. ముఖ్యంగా ఎన్నికల కమిషన్ పైనే ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా మరోసారి ఈ ఆరోపణలనే రిపీట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కర్ణాటక, మహారాష్ట్ర ఎన్నికల్లో భారీ అవకతవకలు జరిగాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. దీనికి తాము చేసిన దర్యాప్తును ఆధారంగా చూపించారు. కర్ణాటకలోని మహదేవపుర నియోజకవర్గంలో 6.5 లక్షల ఓటర్లలో 1 లక్షకు పైగా నకిలీ ఓటర్లు ఉన్నారని, నకిలీ చిరునామాలతో ఓటర్ జాబితాలు తయారయ్యాయని పేర్కొన్నారు. మహారాష్ట్రలో గత 5 నెలల్లో కోటి మంది కొత్త ఓటర్లు జతచేయబడ్డారని, ఎన్నికల సమయంలో సాయంత్రం ఐదున్నర గంటల తర్వాత అసాధారణంగా ఓటింగ్ శాతం పెరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పరిశోధనలో ఈ వివరాలు బయటపడ్డాయని తెలిపారు. దీని ద్వారా ఈసీ సమగ్రత ప్రశ్నార్థకంగా మారిందని రాహుల్ విమర్శించారు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాహుల్ గాంధీ ఈసీ, బీజేపీలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈసీ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోందని.., ఎన్నికల్లో ఓటు దొంగతనం జరుగుతోందని ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఇండియా అలయన్స్ అంచనాలకు విరుద్ధంగా ఉన్నాయని, బీజేపీ వ్యతిరేక సెంటిమెంట్ స్పష్టంగా ఉన్నప్పటికీ ఫలితాలు వారికి అనుకూలంగా వచ్చాయని పేర్కొన్నారు. ఈసీ ఓటర్ జాబితాలను మెషిన్-రీడబుల్ ఫార్మాట్లో ఇవ్వడం లేదని, డేటా షేరింగ్‌లో పారదర్శకత లేదని, డిజిటల్ స్కానింగ్‌ను కూడా అడ్డుకుంటోందని ఆరోపించారు.
మహారాష్ట్రలో ఐదు నెలల్లోనే 40 లక్షల మంది ఓటర్లు నమోదయ్యారని… ఐదేళ్లలో నమోదైన వారి కంటే.. ఐదు నెలల్లో నమోదైన ఓటర్లే ఎక్కువని రాహుల్ తెలిపారు. మహారాష్ట్రలో లోక్‌సభ, విధానసభ ఎన్నికల మధ్య సమయంలో కోటి మంది ఓటర్లు నమోదయ్యారని…అయితే ఓటర్ల జాబితా తమకు ఇచ్చేందుకు ఈసీ నిరాకరించిందని… అది దేశ సంపద.. దానిని ఎందుకు చూపించట్లేదని రాహుల్ ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న తమ అనుమానం మహారాష్ట్ర ఫలితాలతో నిజమైందన్నారు. మెషిన్ రీడ్ చేయగల ఓటరు లిస్టును ఎన్నికల సంఘం ఇవ్వకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోందన్నారు.
రాహుల్ గాంధీ ఆరోపణలు కేవలం కర్ణాటక, మహారాష్ట్రకే పరిమితం కాలేదు. మధ్యప్రదేశ్, హర్యానాలో కూడా ఓటింగ్, ఫలితాల్లో తేడాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్‌తో ఫలితాలకు సంబంధం లేదని, బీజేపీ అనుకూల ఫలితాలు అనుమానాస్పదంగా వస్తున్నాయని ఆరోపించారు. ప్రజల సెంటిమెంట్ ఒకటి, ఫలితాలు మరొకటి కనిపిస్తోందని అన్నారు. ఈసీ ఈ అవకతవకలపై స్పందించకపోవడం అనుమానాలను రేకెత్తిస్తోంది అని చెప్పుకొచ్చారు. Rahul Allegations on Election Process.
రాహుల్ గాంధీ ఆరోపణలను బీజేపీ, ఎలక్షన్ కమిషన్ తీవ్రంగా ఖండించాయి. ఈసీ అధికారికంగా స్పందిస్తూ.. ఇవి ఆధారరహిత, బాధ్యతారహిత ఆరోపణలు అని పేర్కొంది. రాహుల్ చేసిన ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలని, అధికారికంగా ఫిర్యాదు చేయాలని కోరింది. కర్ణాటక రాష్ట్ర ఎన్నికల అధికారులు కూడా రాహుల్‌ను నిర్దిష్ట ఆధారాలతో సంప్రదించాలని సూచించారు. బీజేపీ నేతలు రాహుల్‌ను దేశవ్యతిరేకిగా అభివర్ణిస్తూ, ఓటర్లపై అపవాదు వేస్తూ దేశ ఎన్నికల సమగ్రతను దెబ్బతీస్తున్నారు అని విమర్శించారు. ఈ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని, ఎన్నికల్లో ఓడిపోయిన నిరాశలో రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ పేర్కొంది.
రాహుల్ గాంధీ ఆరోపణలు ఓటర్లలో అవిశ్వాస వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని బీజేపీ విమర్శిస్తోంది. భారత ఎన్నికల వ్యవస్థ సక్రమంగా పనిచేస్తోంది లేదా అనే ప్రశ్నలు సామాన్య ప్రజల్లో, మీడియాలో చర్చనీయాంశమయ్యాయని అంటున్నారు. మరోవైపు రాహుల్ విమర్శలతో నకిలీ ఓటర్లు, డేటా లీక్‌లు, టెక్నాలజీ దుర్వినియోగం వంటి అంశాలు ఎన్నికల ప్రక్రియపై కొత్త చర్చను రేకెత్తించాయి. బీజేపీ, ఈసీ ఈ ఆరోపణలను ఆధారరహితం అని కొట్టిపారేస్తున్నప్పటికీ, రాహుల్ గాంధీ తన విమర్శలను మరింత ఉద్ధృతం చేస్తూ ఎన్నికల సమగ్రతపై సంచలన చర్చను ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. వీటి ప్రస్తావన మాత్రం రాహుల్ చేయడం లేదు.
భారత ఎన్నికల వ్యవస్థపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఎలక్షన్ కమిషన్ పనితీరుపైనే ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. కర్ణాటక, మహారాష్ట్రలో నకిలీ ఓటర్లు, ఓటింగ్ లెక్కల్లో అవకతవకలు జరిగాయని తీవ్ర ఆరోపణలు చేశారు. అసులు ఈసీపై రాహుల్ గాంధీకి వచ్చిన అనుమానం ఏంటి..? దీనిపై ఎన్నికల కమిషన్, బీజేపీ ఎలా స్పందించింది? ఈ వివాదాల వెనుక వాస్తవాలు ఏమిటి?
దేశంలో వరుస ఓటములు చూస్తోన్న కాంగ్రెస్ పార్టీ.. మొదటి నుంచి ఎన్నికల కమిషన్ పై విమర్శలు చేస్తోంది. ముఖ్యంగా ఎన్నికల కమిషన్ పైనే ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా మరోసారి ఈ ఆరోపణలనే రిపీట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కర్ణాటక, మహారాష్ట్ర ఎన్నికల్లో భారీ అవకతవకలు జరిగాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. దీనికి తాము చేసిన దర్యాప్తును ఆధారంగా చూపించారు. కర్ణాటకలోని మహదేవపుర నియోజకవర్గంలో 6.5 లక్షల ఓటర్లలో 1 లక్షకు పైగా నకిలీ ఓటర్లు ఉన్నారని, నకిలీ చిరునామాలతో ఓటర్ జాబితాలు తయారయ్యాయని పేర్కొన్నారు. మహారాష్ట్రలో గత 5 నెలల్లో కోటి మంది కొత్త ఓటర్లు జతచేయబడ్డారని, ఎన్నికల సమయంలో సాయంత్రం ఐదున్నర గంటల తర్వాత అసాధారణంగా ఓటింగ్ శాతం పెరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పరిశోధనలో ఈ వివరాలు బయటపడ్డాయని తెలిపారు. దీని ద్వారా ఈసీ సమగ్రత ప్రశ్నార్థకంగా మారిందని రాహుల్ విమర్శించారు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాహుల్ గాంధీ ఈసీ, బీజేపీలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈసీ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోందని.., ఎన్నికల్లో ఓటు దొంగతనం జరుగుతోందని ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఇండియా అలయన్స్ అంచనాలకు విరుద్ధంగా ఉన్నాయని, బీజేపీ వ్యతిరేక సెంటిమెంట్ స్పష్టంగా ఉన్నప్పటికీ ఫలితాలు వారికి అనుకూలంగా వచ్చాయని పేర్కొన్నారు. ఈసీ ఓటర్ జాబితాలను మెషిన్-రీడబుల్ ఫార్మాట్లో ఇవ్వడం లేదని, డేటా షేరింగ్‌లో పారదర్శకత లేదని, డిజిటల్ స్కానింగ్‌ను కూడా అడ్డుకుంటోందని ఆరోపించారు.
మహారాష్ట్రలో ఐదు నెలల్లోనే 40 లక్షల మంది ఓటర్లు నమోదయ్యారని… ఐదేళ్లలో నమోదైన వారి కంటే.. ఐదు నెలల్లో నమోదైన ఓటర్లే ఎక్కువని రాహుల్ తెలిపారు. మహారాష్ట్రలో లోక్‌సభ, విధానసభ ఎన్నికల మధ్య సమయంలో కోటి మంది ఓటర్లు నమోదయ్యారని…అయితే ఓటర్ల జాబితా తమకు ఇచ్చేందుకు ఈసీ నిరాకరించిందని… అది దేశ సంపద.. దానిని ఎందుకు చూపించట్లేదని రాహుల్ ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న తమ అనుమానం మహారాష్ట్ర ఫలితాలతో నిజమైందన్నారు. మెషిన్ రీడ్ చేయగల ఓటరు లిస్టును ఎన్నికల సంఘం ఇవ్వకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోందన్నారు.
రాహుల్ గాంధీ ఆరోపణలు కేవలం కర్ణాటక, మహారాష్ట్రకే పరిమితం కాలేదు. మధ్యప్రదేశ్, హర్యానాలో కూడా ఓటింగ్, ఫలితాల్లో తేడాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్‌తో ఫలితాలకు సంబంధం లేదని, బీజేపీ అనుకూల ఫలితాలు అనుమానాస్పదంగా వస్తున్నాయని ఆరోపించారు. ప్రజల సెంటిమెంట్ ఒకటి, ఫలితాలు మరొకటి కనిపిస్తోందని అన్నారు. ఈసీ ఈ అవకతవకలపై స్పందించకపోవడం అనుమానాలను రేకెత్తిస్తోంది అని చెప్పుకొచ్చారు.
రాహుల్ గాంధీ ఆరోపణలను బీజేపీ, ఎలక్షన్ కమిషన్ తీవ్రంగా ఖండించాయి. ఈసీ అధికారికంగా స్పందిస్తూ.. ఇవి ఆధారరహిత, బాధ్యతారహిత ఆరోపణలు అని పేర్కొంది. రాహుల్ చేసిన ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలని, అధికారికంగా ఫిర్యాదు చేయాలని కోరింది. కర్ణాటక రాష్ట్ర ఎన్నికల అధికారులు కూడా రాహుల్‌ను నిర్దిష్ట ఆధారాలతో సంప్రదించాలని సూచించారు. బీజేపీ నేతలు రాహుల్‌ను దేశవ్యతిరేకిగా అభివర్ణిస్తూ, ఓటర్లపై అపవాదు వేస్తూ దేశ ఎన్నికల సమగ్రతను దెబ్బతీస్తున్నారు అని విమర్శించారు. ఈ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని, ఎన్నికల్లో ఓడిపోయిన నిరాశలో రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ పేర్కొంది.
రాహుల్ గాంధీ ఆరోపణలు ఓటర్లలో అవిశ్వాస వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని బీజేపీ విమర్శిస్తోంది. భారత ఎన్నికల వ్యవస్థ సక్రమంగా పనిచేస్తోంది లేదా అనే ప్రశ్నలు సామాన్య ప్రజల్లో, మీడియాలో చర్చనీయాంశమయ్యాయని అంటున్నారు. మరోవైపు రాహుల్ విమర్శలతో నకిలీ ఓటర్లు, డేటా లీక్‌లు, టెక్నాలజీ దుర్వినియోగం వంటి అంశాలు ఎన్నికల ప్రక్రియపై కొత్త చర్చను రేకెత్తించాయి. బీజేపీ, ఈసీ ఈ ఆరోపణలను ఆధారరహితం అని కొట్టిపారేస్తున్నప్పటికీ, రాహుల్ గాంధీ తన విమర్శలను మరింత ఉద్ధృతం చేస్తూ ఎన్నికల సమగ్రతపై సంచలన చర్చను ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. వీటి ప్రస్తావన మాత్రం రాహుల్ చేయడం లేదు.
Also Read: https://mega9tv.com/national/donald-trump-hits-india-with-50-tariff-on-russian-oil-buys/