ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లక్ష్యానికి మీరంతా స్ఫూర్తి ప్రదాతలు:మంత్రి లోకేష్

Spread the love

శ్రీకాకుళం జిల్లా, జి. సిగడాం మండలం, పున్నాం పంచాయతీ బూటుపేట ప్రాథమిక పాఠశాల లో ప్రధానోపాధ్యాయినిగా విధులు నిర్వర్తిస్తున్న కూర్మాన అరుణకుమారి టీచర్ సృజనాత్మకంగా  బొమ్మలు, షార్ట్ ఫిల్మ్స్, వర్కింగ్ మోడల్స్‌తో పాఠాలను పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా బోధిస్తున్న తీరు ప్రశంసనీయమని ఏపీ విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియోను ఆయన పంచుకున్నారు.  గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్, రాష్ట్ర–జాతీయ స్థాయి విద్యా శిక్షణల్లో కేఆర్పీగా, మాడ్యూల్ రచయితగా, ఈ–కంటెంట్ సృష్టికర్తగా అరుణ కుమారి టీచర్ ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు.   ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లక్ష్యానికి మీరంతా స్ఫూర్తి ప్రదాతలని లోకేష్ పేర్కొన్నారు. కాగా, లోకేష్ పోస్ట్ కు సదరు టీచర్ స్పందించారు. విద్యా ప్రమాణాల పెంపుకు మీరు తీసుకుంటున్న నిర్ణయాలు విద్యారంగానికి కొత్త దిశను చూపిస్తున్నాయన్నారు. ఉపాధ్యాయుల కృషిని గుర్తించి ప్రోత్సహించడం మీ గొప్ప నాయకత్వ లక్షణం. మీ మార్గదర్శకత్వంలో విద్యా వ్యవస్థ మరింత ప్రగతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అరుణ కుమారి టీచర్  బదులిచ్చారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *