మీరే మ‌న‌ పార్టీకి అసలైన బలం.. నా బ‌లం:వై.ఎస్.జగన్

Spread the love

నేడు వై.ఎస్.ఆర్.సీ.పీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వై.ఎస్.జగన్ కార్యకర్తలకు, నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. నా ధైర్యం మీరే…నా బలం మీరే…నాన్న గారి ఆశయ సాధన కోసం స్థాపించినమ‌న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, న‌న్ను మీరు గుండెల్లో పెట్టుకున్నారు, భుజాలపై మోస్తున్నారు.కష్టకాలంలో వెనక్కి తగ్గకుండా పార్టీ కోసం నిల‌బ‌డుతున్నారు. పార్టీపై నమ్మకం పెట్టుకుని, నాపై న‌మ్మకం ఉంచి పార్టీ కోసం నిలిచిన మీరే మ‌న‌ పార్టీకి అసలైన బలం.. నా బ‌లం అని పేర్కొన్నారు. మన పార్టీ ప్రస్థానంకేవలం ఒక రాజకీయ ప్రయాణం మాత్రమే కాదు…ఒక ల‌క్ష్యంతో లక్షలాది మంది కార్యకర్తల క‌ష్టం, నమ్మకం, త్యాగాలకు నిలువెత్తు సాక్ష్యమని అన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు, నాయకులకు పేరు పేరునా శుభాకాంక్షలు అంటూ జగన్ ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *