ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వై.ఎస్.జగన్ స్పందించారు. తమిళనాడు లో టీవీకే పార్టీ ఘన విజయం దిశగా దూసుకుపోతున్న వేళ విజయ్ కు శుభాకాంక్షలు తెలిపారు. నా ప్రియమైన సోదరుడు విజయ్ కి హృదయపూర్వక అభినందనలు! నీ మొట్టమొదటి ఎన్నికల్లోనే అతిపెద్ద పార్టీగా అవతరించడం నిజంగా అద్భుతం. ప్రజా సేవలో నువ్వు ప్రారంభిస్తున్న ఈ కొత్త అధ్యాయంలో నీకు మరెంతో శక్తి, విజయం చేకూరాలని కోరుకుంటున్నాను. దేవుని ఆశీస్సులు నీకు తోడుండాలని జగన్ పేర్కొన్నారు. ఇక పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వం లోని తృణమూల్ కాంగ్రెస్ పరాజయం దిశగా సాగుతున్న విషయం తెలిసిందే. దీనిపై దీదీ పట్ల జగన్ తన సానుభూతిని తెలియజేశారు. అలాగే అస్సాం, పశ్చిమ బెంగాల్ లో చరిత్ర సృష్టించిన భారతీయ జనతా పార్టీ మరియు ఇతరులకు జగన్ అభినందనలు తెలిపారు.