దక్షిణాదిన తమిళ రాజకీయాలు ఇప్పుడు ఒక కొత్త అధ్యాయానికి తెరలేపాయి, సినీ నటుడు విజయ్ రాజకీయ అరంగేట్రంలోనే సంచలనం సృష్టించారు. మొదటి ఎన్నికల్లోనే గెలుపు దళపతికి దక్కింది. అన్నట్లుగా విజయ్ భారీ మెజారిటీని సాధించారు. యువత , తొలిసారి ఓటు వేసే వారంతా విజయ్ వైపు ఏకపక్షంగా మొగ్గు చూపడం గమనార్హం. దశాబ్దాలుగా సాగుతున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి ‘తమిళగ వెట్రి కళగం’ బలమైన చెక్ పెట్టింది. అవినీతి రహిత పాలన, కుటుంబ పాలనపై ఆయన చేసిన పోరాటం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. తన సినీ ఇమేజ్‌ను కేవలం గ్లామర్‌గా మాత్రమే కాకుండా ఒక రాజకీయ శక్తిగా మార్చుకోవడంలో విజయ్ సక్సెస్ అయ్యారు. డీఎంకే ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతను తనవైపు తిప్పుకోవడంలో ఆయన వేసిన ఎత్తుగడలు ఫలించాయి. స్టాలిన్ , ఉదయనిధి స్టాలిన్‌పై వచ్చిన విమర్శలు అధికార పార్టీని మూడో స్థానానికి పడిపోయేలా చేశాయి. తమిళనాడులో మూడవ ప్రత్యామ్నాయం సాధ్యమేనని విజయ్ ఈ ఎన్నికల ద్వారా నిరూపించి చూపారు. ఈ ఎన్నికల్లో మరొక పాత పార్టీల వైఫల్యాలను తమకు అనుకూలంగా మార్చుకున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో విజయ్ రాకతో డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి దిగ్గజ పార్టీలకు ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.