వైసీపీ అధినేత జగన్ మోదీ బానిస కాకుంటే, బీజేపీకి దత్తపుత్రుడు కాదనుకుంటే, CEC జ్ఞానేశ్వర్ గారిపై పెట్టే అభిశంసన తీర్మానానికి మద్దతు ఇవ్వాలని ఏపీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిల అన్నారు. YCP ఎంపీలు INDIA బ్లాక్ ఎంపీలతో కలిసి సంతకాలు పెట్టాలన్నారు. అభిశంసనకు మద్దతు ఇస్తున్నట్లు వైసీపీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఈవీఎంలు మారిపోయాయని దొంగ ఏడుపులు ఏడ్చారు కదా ? నా అక్క చెల్లెమ్మల ఓట్లు ఎక్కడ పోయాయో అని బీద ఏడుపులు ఏడ్చారు కదా ? కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాదని, దొంగ ప్రభుత్వమని చెప్పారు కదా ? అని ప్రశ్నించారు. జగన్ కి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఇండియా కూటమి పెట్టే తీర్మానానికి మద్దతు ప్రకటించాలని పేర్కొన్నారు. మోదీగారు ఎన్నికల సంఘాన్ని చేతుల్లో పెట్టుకున్నారు. CEC జ్ఞానేశ్వర్ గారు అవసరమైన చోట దొంగ ఓట్లు, అవసరం లేని చోట ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కమీషన్ రాజ్యాంగ విరుద్ధంగా పని చేస్తోందని షర్మిల ఆరోపణాస్త్రాలు సంధించారు.