కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన VB G- RAM G చట్టాన్ని రద్దు చేయాలని, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని ( MGNREGA) తిరిగి అమలు చేయాలని ఏపీసీసీ ఛీఫ్ వై.ఎస్.షర్మిల చేపట్టిన పరిరక్షణ యాత్ర నేడు నంద్యాల జిల్లాలో సాగుతోంది. గోస్పాడు మండలం, కానాలపల్లె గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో గ్రామస్థులతో ఆమె మాట్లాడారు. MGNREGA పై గ్రామస్థులు తమ అభిప్రాయాలను తెలిపారు. అనునిత్యం ఉపాధినే నమ్ముకున్న పేద ప్రజల బాధలు వింటుంటే మన్రేగాపై మోడీ గారు కుట్రలు పన్ని, 80 వేల కోట్లను శ్రామికులకు కాకుండా, తన కాంట్రాక్టర్లకు అప్పజెప్పేందుకు కొత్త చట్టం వీబీ గ్రామ్ జి తెచ్చారని స్పష్టంగా అర్థమైందని షర్మిల విమర్శించారు. ఈ యాత్ర రాష్ట్రవ్యాప్తంగా షర్మిల చేస్తున్నారు కాగా, ఈ అంశంలో చంద్రబాబు మోదీకి మద్దతు ఇవ్వడం దారుణమని ప్రతిపక్షం కావాలని అడిగే జగన్ సైతం నోరు విప్పలేదని షర్మిల మండిపడుతున్నారు. కేంద్రంలో ఉన్న మోడీ సర్కారుతో పాటు రాష్ట్రంలో బాబు, జగన్, పవన్ ముగ్గురిపైనా షర్మిల విమర్శలు గుప్పిస్తున్నారు.