శ్రేణుల్లో జోష్ నింపిన జనసేనాని స్పీచ్ 

Spread the love

జనసేన రక్షా దళ్, నిర్వాహక్ దళ, పరిపాలక్ దళ్ లు సమర్థంగా పార్టీని నడిపిస్తాయని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. సంస్థాగత నిర్మాణంతో జనసేనకు కొత్త బలగమని కార్యకర్త నుంచి నాయకుడిగా ఎదిగేందుకు జనసేన వేదికని పేర్కొన్నారు. . జనసేన ఏడు సిద్ధాంతాల భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. జనసేన ఉద్యమి ఆత్మీయ సమావేశం మంగళగిరిలో జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి పొత్తులో జనసేన కార్యకర్తల ఆత్మగౌరవం తగ్గించనని తేల్చిచెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు బలంగా ముందుకు వెళదామని పిలుపునిచ్చారు. ఇటీవల కాలంలో ఆరోగ్య ఇబ్బందులతో కొంతకాలం దూరంగా ఉండాల్సి వచ్చిందని  కరోనా సమయంలో ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ అలాగే ఉండిపోవడంతో అది సైనస్ గా మారింది. దుమ్ము, దూళిలో తిరగడంతో అది మరింత తీవ్రమైంది. అలాగే మజాలకు సంబంధించిన నొప్పి తీవ్రం అయింది. మీ ప్రేమతో దగ్గరకు వచ్చినపుడు నన్ను గట్టిగా లాగేయడంతో మజాలకు సమస్య ఏర్పడిందని తెలిపారు. దీంతో పాటు స్పైనల్ కార్డ్ సమస్య గతంలో ఉంది. ఈ సమస్యల వల్ల కొంతకాలం పాలనకు, పార్టీకి దూరంగా ఉండాల్సి వచ్చిందని తెలిపారు.  ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదు. ఆరోగ్యం సరిగా ఉందని తన ఆరోగ్యం కోసం ప్రార్ధించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. 

ఇక తాజా పరిణామాలపై కూడా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో ఇటీవల కొత్తగా పెట్టిన ఓ రాజకీయ పార్టీ విజయం సాధించడంతో ఇక్కడ కూడా చాలామంది. రకరకాలుగా మాట్లాడుతున్నారు. 2019లో జనసేన అలాంటి ప్రయత్నమే చేసిందన్నారు. అయితే ఫలితాలు దానికి తగినట్లు రాలేదని పేర్కొన్నారు. తమిళనాడు రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు వేరు. నాకు పదవే ముఖ్యం అనుకొని రాజకీయాల్లోకి వచ్చి ఉంటే 2008లోనే యూత్ వింగ్ ప్రెసిడెంట్ గా ఉండి 2009లో మల్కాజ్ గిరి నుంచి ఎంపీ పోటీ చేసే వాడినని తెలిపారు. అయితే తానెప్పుడూ పదవి గురించి ఆలోచించలేదని  రాజకీయాల్లో నలగాలి.. ప్రజల నమ్మకం చూరగొనాలని స్పష్టం చేశారు. ఇక పశ్చిమాసియా యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇప్పటి వరకు భారతదేశం పైనా ఎలాంటి ప్రభావం లేకపోవడం వెనుక కేంద్ర ప్రభుత్వ జాగురూకత, ముందుచూపు చాలా ఉందని  అయితే దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చెబుతున్న ఇందన పొదుపు చర్యలు చాలా ఉన్నతమైనవని పేర్కొన్నారు.  దానిని దేశం మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ పాటించాలని అన్నారు. అంతర్జాతీయ పరిణామాలు, జరుగుతున్న విషయాలను జనసైనికులు, వీర మహిళలు ఎప్పటికప్పుడు అర్ధం చేసుకోవాలని  అంతర్జాతీయ పరిణామాలు కూడా మన మీద ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలని సూచించారు. మీరు తెలుసుకొని తెలియని వారికి పార్టీ గళంగా తెలియజేయాలి. దేశ భవిత కోసం ప్రతి పౌరుడు తగిన విధంగా ఇంధన పొదుపు చర్యలు చేపట్టాలి. ప్రధాని మోడీ సూచించినట్లుగా విదేశీ మారకం కాపాడుకునేందుకు కొద్ది రోజులు బంగారం కొనుకుండా ఉండండి. ప్రజా రవాణా వినియోగం మంచిది. ఇంధన వినియోగం తగ్గించే చర్యలు దేశానికి మేలు చేస్తాయి. ఇంధన పొదుపు గురించి చెప్పినా, అంతర్జాతీయ పరిణామాల వల్ల ఇంధనం ధరలు పెరిగినా కూడా అరకొర జ్ఞానం ఉన్న వైసీపీ వాళ్ళు ప్రధాని మోడీ గారిని విమర్శిస్తారు. వైసీపీ వాళ్ళ ఇళ్ళలో గ్యాస్, పెట్రోలు, డీజిల్ ఉండవు కదా. అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకోవాలని వైసీపీకి చురకలంటించారు. తాజాగా పవన్ కొంత కాలం విరామం తరువాత ఇలా శ్రేణులను కలిసి దిశా నిర్దేశం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *