టైగర్ ష్రాఫ్ లక్ష్యంగా కాల్పుల ఘటన…సంచలనం రేపుతున్న ఆడియో లీక్..!
కామెంట్లు (0)

ముంబై దేశ ఆర్థిక రాజధాని అలాగే ఎన్నో పరిశ్రమలకు కేరాఫ్ అడ్రెస్. అలాగే ఒకప్పుడు అండర్ వరల్డ్ కు అడ్డాగా పేరొందింది. అండర్ వరల్డ్ అనగానే దావూద్ ఇబ్రహీం, ఛోటా రాజన్ లాంటి పేర్లు వినిపించేవి. వాళ్ల పేరు చెబితే హిందీ సినీ పరిశ్రమ కూడా బెంబేలెత్తిపోయేది. అయితే గత కొన్నేళ్లుగా సైలెంట్ గా ఉన్న ముంబైలో ఇప్పుడు మళ్లీ తుపాకుల మోత మోగుతోంది. బాలీవుడ్ ప్రముఖులే టార్గెట్ గా ఒక కొత్త గ్యాంగ్ ముంబైలో హల్ చల్ చేస్తోంది. అదే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్. తాజాగా బాలీవుడ్ యాక్షన్ స్టార్ టైగర్ ష్రాఫ్ పై ముంబై నడిబొడ్డున గుర్తుతెలియని దుండగులు కాల్పులకు తెగబడటం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ ఘటనలో అదృష్టవశాత్తూ టైగర్ ష్రాఫ్ త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన జరిగిన కొద్ది గంటలకే, ఈ కాల్పులకు మేమే బాధ్యులం అంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఒక ఆడియో క్లిప్ వెలుగులోకి రావడం బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
టైగర్ ష్రాఫ్ అంటేనే ఈ జెనెరేషన్ యాక్టర్స్ లో ఫిట్ గా ఉండే నటులలో ప్రముఖంగా ఆయన పేరు వినిపిస్తూ ఉంటుంది. సరికొత్తగా స్టంట్ లతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. ఇక ప్రతిరోజూ లాగే ఆదివారం సాయంత్రం కూడా ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న ఒక ఫుట్‌బాల్ గ్రౌండ్ లో ఆడుకుని ఆయన బయటకు వస్తున్నారు. ఆ సమయంలో ఆయన కారు కోసం వెయిట్ చేస్తున్న క్రమంలో, మోటార్ సైకిల్‌పై గుర్తుతెలియని వ్యక్తులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే విచక్షణారహితంగా కాల్పులు జరపడం మొదలుపెట్టారు. అయితే అదృష్టవశాత్తూ టైగర్ ష్రాఫ్ ఈ దాడి నుంచి సురక్షితంగా తప్పించుకున్నారు. కానీ ఈ ఘటనలో ఆయన కారు డ్రైవర్ చేతికి బుల్లెట్ గాయమైంది. వెంటనే డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించారు. ఒక స్టార్ హీరో మీద, అది కూడా ముంబైలోని అత్యంత ఖరీదైన, భద్రత ఉండే జుహు ప్రాంతంలో పట్టపగలు ఇలా బహిరంగంగా కాల్పులు జరగడం భయాందోళనకు గురిచేస్తోంది. ఈ కాల్పులకు దారితీసిన పరిస్థితులు, నిందితులు వాడిన బైక్ నంబర్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే ఒక ఆడియో టేప్ సోషల్ మీడియాలో లీక్ అయ్యి పోలీసులకే సవాల్ విసిరింది.

