నమితా ఈజ్ బ్యాక్…సరికొత్త ట్రాన్స్ఫర్మేషన్..మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ!

రెండు దశాబ్దాల క్రితం సౌత్ ఇండియా మొత్తాన్ని తన గ్లామర్ తో ఊపేసిన హీరోయిన్ నమిత. తమిళనాట సూపర్ స్టార్స్ కు ఉన్న క్రేజ్ ఆమెకు ఉండేది. ఆ తర్వాత బరువు పెరిగి వెండితెరకు దూరమైంది. కానీ ఇప్పుడు ఆమె లేటెస్ట్ లుక్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఏకంగా సగం బరువు తగ్గిపోయి, ఒకప్పటి స్లిమ్ అండ్ గ్లామరస్ నమితను గుర్తు చేస్తోంది. దీంతో నమిత ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు . అంతే కాదు నమిత మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోందనే టాక్ మొదలైంది. మన తెలుగులో కూడా సొంతం, జెమిని, బిల్లా లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది నమిత. దక్షణాదిన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా నటించి విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా కోలీవుడ్ లో అయితే నమితకు గుడి కట్టేంత స్థాయిలో అభిమానులు తయారయ్యారు. తనదైన గ్లామరస్ పాత్రలతో, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో నమిత సౌత్ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. అప్పట్లో ఏ భారీ కమర్షియల్ సినిమా చూసినా నమిత కచ్చితంగా ఉండాల్సిందే అన్నట్లుగా డిమాండ్ ఉండేది. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈ భామ, దాదాపు పదేళ్ల పాటు ఇండస్ట్రీని ఏలింది. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ, కొత్త హీరోయిన్ల రాకతో ఆమెకు నెమ్మదిగా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. దానికి తోడు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆమె ఫిజిక్ లో కూడా నెమ్మదిగా మార్పులు రావడం ప్రారంభమైంది.
సినిమా అవకాశాలు తగ్గిన సమయంలో నమిత బుల్లితెరపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి తన రియల్ లైఫ్ క్యారెక్టర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదే సమయంలో బిగ్ బాస్ హౌస్ లో పరిచయమైన నటుడు వీరేంద్ర చౌదరితో ఆమెకు సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారి, పెద్దల అంగీకారంతో వీరిద్దరూ చాలా ఘనంగా వివాహం చేసుకున్నారు. కానీ వివాహం తర్వాత నమిత జీవితంలో ఊహించని మార్పులు వచ్చాయి. పెళ్లి తర్వాత ఆమె విపరీతంగా బరువు పెరిగింది. హీరోయిన్ గా కంటిన్యూ అవ్వాలంటే జీరో సైజ్ లేదా ఫిట్ గా ఉండటం తప్పనిసరి అయిన ఇండస్ట్రీలో.. నమిత ఓవర్ వెయిట్ వల్ల ఆమెకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. బాగా బొద్దుగా మారడం వల్ల క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా సరైన రోల్స్ రాలేదు. దీంతో ఆమె కొన్నాళ్ల పాటు పూర్తిగా మీడియాకు, గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉండిపోయింది. సినిమాల్లో అవకాశాలు లేకపోయినా నమిత ఖాళీగా కూర్చోలేదు. తనకున్న పాపులారిటీని, ప్రజాదరణను సరైన మార్గంలో ఉపయోగించుకోవాలని భావించింది. అలాంటి పరిస్థితుల్లోనే ఆమె రాజకీయాల వైపు అడుగులు వేసింది. జాతీయ పార్టీలో అధికారికంగా చేరి, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం మొదలుపెట్టింది. తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ తరపున విస్తృతంగా ప్రచారాలు చేస్తూ, ప్రజల సమస్యలపై స్పందిస్తూ ఒక పూర్తి స్థాయి పొలిటీషియన్ గా మారిపోయింది. ఒక గ్లామర్ హీరోయిన్ ఇలా రాజకీయ నాయకురాలిగా మారిపోవడం అప్పట్లో చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. కానీ నమిత మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, ప్రస్తుతం బీజేపీలో అత్యంత యాక్టివ్ లీడర్ గా కొనసాగుతోంది. అయితే తాజాగా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక వీడియో నెట్టింట సెన్సేషన్ గా మారింది. జిమ్‌లో చెమటోడ్చుతూ, అత్యంత కఠినమైన కసరత్తులు చేస్తున్న ఆ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఒకప్పుడు గుర్తుపట్టలేనంతగా బొద్దుగా మారిపోయిన ఈ బ్యూటీ.. ఇప్పుడు విపరీతంగా బరువు తగ్గి స్లిమ్‌గా తయారైంది. ఆ జిమ్ వీడియో చూసిన నెటిజన్లు.. అసలు ఈమె నమితేనా? అని ఆశ్చర్యపోతున్నారు. ఎంతో పట్టుదలతో, కఠినమైన వర్కౌట్స్ చేస్తూ తన పాత గ్లామర్ ను మళ్లీ వెనక్కి తెచ్చుకుంది. ఆమె డెడికేషన్ కు సోషల్ మీడియాలో నెటిజన్లు సలాం కొడుతున్నారు. బాడీ షేమింగ్ చేసిన వాళ్లందరికీ తన రిజల్ట్ తోనే ఆమె గట్టి సమాధానం చెప్పింది. ఇక తాజాగా ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ప్రముఖ యూట్యూబర్ డీజే సిద్దు దర్శకత్వం వహిస్తున్న 'డయంకరం' అనే చిత్రంలో నమిత ఓ కీలక పాత్ర చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ తో ఆమె మళ్లీ వెండితెరపై మెరవబోతోందని సమాచారం.



