పవన్ 'అర్జున'..ఆ బంపర్ ఆఫర్ కొట్టేది ఎవరు?

తెలుగు సినీ పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రూటే సపరేట్. ఆయన సినిమాలకు ఎంత దూరం ఉంటే, ఫ్యాన్స్ లో ఆయనను తెరపై చూడాలనే ఆకలి అంతగా పెరిగిపోతోంది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రజా సేవలో, ప్రభుత్వ వ్యవహారాల్లో అహర్నిశలు శ్రమిస్తున్న పవన్ కళ్యాణ్.. తన సినిమాలకు సంబంధించిన కమిట్మెంట్స్ ను కూడా అంతే పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థతో పవన్ ఒక మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్ ను చేస్తున్నారన్న వార్తలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. ఈ సినిమా కోసం ఫిల్మ్ ఛాంబర్ లో అర్జున అనే పవర్ ఫుల్ టైటిల్ ను రిజిస్టర్ చేశారు. అంతేకాదు, ఈ సినిమాను డైరెక్ట్ చేయడానికి టాలీవుడ్ కు చెందిన ఏకంగా ముగ్గురు బడా దర్శకులు పోటీ పడుతున్నారని, హీరోయిన్ల పేర్లు కూడా ఫైనల్ అవుతున్నాయని గట్టి టాక్ నడుస్తోంది.
వకీల్ సాబ్ లాంటి సోషల్ మెసేజ్ ఉన్న సినిమాను పవన్ కళ్యాణ్ తో దిల్ రాజు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక అల్టిమేట్ పొలిటికల్ పవర్ లో ఉన్నారు. ఈ సమయంలో ఆయనతో ఒక పక్కా కమర్షియల్, అండ్ పొలిటికల్ టచ్ ఉన్న మాస్ ఎంటర్టైనర్ తీస్తే అది ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడం ఖాయమని దిల్ రాజు బలంగా నమ్ముతున్నారు. అందుకే పవన్ తో చేసే సినిమా కోసం అర్జున అనే టైటిల్ను లాక్ చేసినట్లు ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తోంది. అవినీతిపై, అక్రమాలపై అలుపెరగని పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి ఈ అర్జున టైటిల్ నూటికి నూరు శాతం సరిపోతుంది. సమాజంలోని అన్యాయంపై, సిస్టమ్ లో ఉన్న లొసుగులపై ఒక పవర్ ఫుల్ నాయకుడు ఎలా పోరాడాడు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. పక్కా కమర్షియల్ హంగులతో పాటు, పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఐడియాలజీకి సరిపోయే అద్భుతమైన, పదునైన డైలాగ్స్ తో ఈ అర్జున స్క్రిప్ట్ సిద్ధమవుతోందని సమాచారం. అయితే ఇంతటి భారీ సబ్జెక్ట్ ను, అదీ పవన్ లాంటి మాస్ లీడర్ కు తగ్గట్లుగా తెరకెక్కించాలంటే ఒక బడా డైరెక్టర్ చేతిలోనే పెట్టాలి. అందుకే దిల్ రాజు ఏకంగా ముగ్గురు స్టార్ డైరెక్టర్లను ఈ ప్రాజెక్ట్ కోసం పరిశీలిస్తున్నారు.



