శత్రువులకు హడల్…భారత్ తో ఫిలిప్పీన్స్ భారీ బ్రహ్మోస్ డీల్!

ఒకప్పుడు పలు దేశాల నుండి వేల కోట్ల రూపాయలు పెట్టి ఆయుధాలను కొనుక్కునే స్థాయి నుంచి.. ఇప్పుడు అదే వేల కోట్ల రూపాయల ఆయుధాలను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారతదేశం ఎదిగింది. ముఖ్యంగా బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆసియాలో పొరుగు దేశాలను, ముఖ్యంగా చిన్న దేశాలను తన మిలిటరీ పవర్ తో భయపెట్టాలని చూసే డ్రాగన్ కంట్రీ చైనాకు ఇప్పుడు ఇండియా ఒక మైండ్ బ్లాంక్ అయ్యే మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. సౌత్ చైనా సీ వివాదంలో చైనాతో డైరెక్ట్ గా గొడవ పడుతున్న ఫిలిప్పీన్స్ ఇండియాతో ఏకంగా 6,700 కోట్ల భారీ డీల్ కు రెడీ అయింది. ఈ డీల్ కింద సుమారు 60 బ్రహ్మోస్ మిస్సైల్స్ ను ఫిలిప్పీన్స్ కు ఇండియా సప్లై చేయబోతోంది. అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఇండియా , ఫిలిప్పీన్స్ మధ్య ప్రస్తుతం ఒక భారీ డిఫెన్స్ డీల్ దాదాపు ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. 2022లో ఫిలిప్పీన్స్ మన దేశంతో 375 మిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకుని బ్రహ్మోస్ సిస్టమ్స్ ను కొనుగోలు చేసింది. వాటి డెలివరీలు ఇప్పుడు ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి. అయితే చైనాతో ముప్పు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో, ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ మరిన్ని బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించారు.
తాజా ప్రపోజల్ ప్రకారం.. 700 నుంచి 800 మిలియన్ డాలర్ల ఖర్చుతో ఏకంగా 5 బ్రహ్మోస్ సిస్టమ్స్ ను, అంటే సుమారు 60కి పైగా సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ఫిలిప్పీన్స్ ప్రొక్యూర్ చేసుకోబోతోంది. ఢిల్లీలో జరిగిన ఢిల్లీ డిఫెన్స్ డైలాగ్ లో వర్చువల్ గా పాల్గొన్న ఫిలిప్పీన్స్ డిఫెన్స్ సెక్రటరీ గిల్బర్టో టియోడోరో కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. తమ కోస్టల్ డిఫెన్స్ కు తగ్గట్లుగా బ్రహ్మోస్ లో కొన్ని మార్పులు చేయాలని ఇండియాకు ఒక విష్ లిస్ట్ పంపినట్లు ఆయన తెలిపారు. సౌత్ చైనా సముద్రం మొత్తం తనదేనని చైనా వాదిస్తుంటే, ఇంటర్నేషనల్ చట్టాల ప్రకారం తమ తీర ప్రాంతం తమకే చెందుతుందని ఫిలిప్పీన్స్ వాదిస్తోంది. ఈ క్రమంలోనే గత కొన్నేళ్లుగా చైనా కోస్ట్ గార్డ్ నౌకలు కావాలనే ఫిలిప్పీన్స్ పడవలపై వాటర్ క్యానన్స్ తో దాడులు చేయడం, ఢీకొట్టడం లాంటి కవ్వింపు చర్యలకు దిగుతున్నాయి. దీంతో తమ తీరప్రాంత రక్షణను కట్టుదిట్టం చేయడానికి, తమ మిలిటరీని మోడ్రనైజ్ చేయడానికి ఫిలిప్పీన్స్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
సరిగ్గా ఇలాంటి సమయంలోనే బ్రహ్మోస్ వైపు ఫిలిప్పీన్స్ చూస్తోంది. ఒకవేళ చైనా యుద్ధ నౌకలు ఫిలిప్పీన్స్ తీరం వైపు వస్తే.. తీరంలో మొబైల్ లాంచర్లపై రెడీగా ఉండే బ్రహ్మోస్ మిస్సైల్స్ తో వాటిని ఈజీగా లాక్ చేయవచ్చు. బ్రహ్మోస్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్రూయిజ్ మిస్సైల్. కాబట్టి అది లాంచ్ అయిన తర్వాత దాని స్పీడ్ కు, చైనా నౌకల్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ దాన్ని అడ్డుకోవడం దాదాపు అసాధ్యం. ఆ భయమే చైనాను ఇప్పుడు ఫిలిప్పీన్స్ జోలికి రాకుండా ఆపుతోంది. భారత్, రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ మిస్సైల్ ను ల్యాండ్, నావల్, ఎయిర్ క్రాఫ్ట్ నుంచి కూడా ప్రయోగించవచ్చు. గత ఏడాది పాకిస్థాన్ తో జరిగిన ఒక చిన్నపాటి ఘర్షణలో ఇండియా తొలిసారి బ్రహ్మోస్ ను కాంబాట్ రోల్ లో వాడటంతో, ప్రపంచవ్యాప్తంగా దీని సామర్థ్యంపై పూర్తి నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు బ్రహ్మోస్ ను కొనుగోలు చేయడానికి క్యూ కడుతున్న దేశాల లిస్ట్ చాలా పెద్దదిగానే ఉంది. భారత్ రీసెంట్ గా జులైలో ఇండోనేషియాకు బ్రహ్మోస్ సప్లై చేయనున్నట్లు న్యూఢిల్లీ ప్రకటించింది. వియత్నాం తో కూడా ఒక ఒప్పందం జరిగింది. ఇవి మాత్రమే కాకుండా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, థాయ్లాండ్, సౌత్ ఆఫ్రికా, , బ్రెజిల్ లాంటి దేశాలతో కూడా ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వ అధికారిక డేటా ప్రకారం.. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ ఎగుమతులు రికార్డు స్థాయిలో 4.11 బిలియన్ డాలర్లకు అంతే సుమారు 38, వేల 424 కోట్లకు చేరుకున్నాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 62 శాతం వృద్ధిని నమోదు చేయడం మేక్ ఇన్ ఇండియా సత్తాకు నిదర్శనం.



