ఫిబ్రవరి నుండి షురూ…మెగాఫ్యాన్స్ కు ఫుల్ జోష్

రంగస్థలం లాంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ తర్వాత మళ్లీ కాంబినేషన్ ప్రేక్షకులకు విశేషంగా ఆసక్తిని పెంచేస్తోంది. అదే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ RC17. ఇప్పుడు ఈ సినిమా హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టడంతో ఈ సినిమా ముహూర్తపు కార్యక్రమాలు ఎంతో గ్రాండ్ గా జరిగాయి ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ వైడ్ గా ఇమేజ్ తెచ్చుకున్న చరణ్, పుష్ప సిరీస్ తో నార్త్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన సుకుమార్.. ఈ ఇద్దరూ కలిసి వస్తుండడంతో ప్రేక్షకుల్లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న RC17 సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా ఎవరు నటించబోతున్నారనే దానిపై రోజుకో వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో హీరోయిన్ కోసం కొత్త భామలను రంగంలోకి దించాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నారట. ముఖ్యంగా సారా అర్జున్ , అలాగే మరో యంగ్ బ్యూటీ సాత్విక వీరవల్లి పేర్లు హీరోయిన్ రేసులో బలంగా వినిపిస్తున్నాయి. అయితే సుకుమార్ మాత్రం తన హీరోయిన్ డీటెయిల్స్ ను ప్రస్తుతానికి అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. నవంబర్ నెలాఖరు లేదా డిసెంబర్ నాటికి హీరోయిన్ తో పాటు ఇతర ముఖ్యమైన కాస్ట్ అండ్ క్రూ వివరాలను అఫీషియల్ గా ఫైనల్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ సినిమా కోసం ఫ్రెష్ ఫేస్ ను తీసుకుంటే పాన్ ఇండియా అప్పీల్ మరింత పెరుగుతుందని దర్శకుడి ఆలోచనగా తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో విలన్ పాత్రకు రిషికాంత్ అనే నటుడి పేరు కూడా పరిశీలనలో ఉందట. మొదట్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ లోనే మొదలవుతుందని వార్తలు వచ్చాయి. కానీ లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం.. RC17 రెగ్యులర్ షూటింగ్ ను వచ్చే ఏడాది, అంటే 2027 ఫిబ్రవరి నుంచి ప్రారంభించాలని చిత్ర బృందం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ తన ఫిజికల్ ప్రిపరేషన్, మేకోవర్ పై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. అయితే సుకుమార్ సినిమాలంటేనే షూటింగ్ కు ఏళ్ల తరబడి సమయం పడుతుందనే విమర్శ ఉంది. దాన్ని బ్రేక్ చేసేలా ఈసారి సుక్కు ఒక పక్కా మాస్టర్ ప్లాన్ రెడీ చేశాడు. ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి, సరిగ్గా 12 నెలల్లో షూటింగ్ , పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసి, 2028 ప్రారంభంలో ఈ పాన్ ఇండియా చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావాలనేది మేకర్స్ టార్గెట్. అందుకే ఎక్కడా గ్యాప్ రాకుండా ప్రీ-ప్రొడక్షన్ దశలోనే అన్నీ పర్ఫెక్ట్ గా లాక్ చేసుకుంటున్నారు. సుకుమార్ సినిమా అనగానే అందులో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అనేది కామన్. ఆర్య నుంచి పుష్ప వరకు వీరిద్దరిదీ ఒక బ్లాక్ బస్టర్ కాంబినేషన్. కానీ RC17 విషయంలో మాత్రం ఒక అనూహ్యమైన మార్పు చోటుచేసుకోబోతున్నట్లు గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు డీఎస్పీ కాకుండా వేరే సంగీత దర్శకుడిని తీసుకునే ఆలోచనలో సుకుమార్ ఉన్నారట. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ , అలాగే దురంధర్ ఫేమ్ శశ్వత్ సచ్దేవ్ పేర్లు మ్యూజిక్ డైరెక్టర్ల రేసులో ఉన్నాయి. ఇక దర్శకుడు సుకుమార్ క్యారెక్టరైజేషన్ రాస్తే అది ఒక రేంజ్ లో ఉంటుంది. రంగస్థలంలో చిట్టిబాబు పాత్ర రామ్ చరణ్ కెరీర్ లోనే ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోయింది. ఇప్పుడు RC17 కోసం అంతకుమించిన ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ ను సుకుమార్ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.



