4 రోజుల్లో 500 కోట్లు..రామాయణ నయా రికార్డు

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన విజువల్ వండర్ రామాయణ: పార్ట్ 1 కేవలం కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా, ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక అరుదైన, రికార్డును సాధించింది. బుక్‌మైషో లో ఇప్పటి వరకు ఉన్న ఆల్ టైమ్ రికార్డులను బద్దలు కొట్టి అగ్రస్థానంలో నిలిచింది. నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన రామాయణ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. బుక్‌మైషో పీక్ అవర్ ట్రెండింగ్ లో రామాయణ క్రియేట్ చేసిన ప్రభంజనం మాములుగా లేదు. పుష్ప 2, ధురంధర్, కల్కి , జవాన్, యానిమల్ లాంటి సినిమాల రికార్డులను చెరిపేసి అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషోలో ఒక సినిమాకు ఒకే గంటలో ఎన్ని వేల టికెట్లు అమ్ముడవుతున్నాయి, ఎంత మంది ఆ సినిమా గురించి సెర్చ్ చేస్తున్నారు అనేదే పీక్ అవర్ ట్రెండింగ్ అంటే. ఈ పీక్ అవర్ ట్రెండింగ్ లో రామాయణ: పార్ట్ 1 సరికొత్త చరిత్ర సృష్టించింది. బుక్‌మైషో అఫీషియల్ లెక్కల ప్రకారం.. రామాయణ ఏకంగా 1 లక్షా ,11వేల 830 ట్రెండింగ్‌తో ఇండియాలో ఆల్ టైమ్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ ఏడాది దీపావళి వీకెండ్ రావడం, దానికి తోడు హాలిడేస్ తో పాటు ఆదివారం సినిమాకు ప్రేక్షకుల నుంచి ఊహించని రేంజ్ లో భారీ స్పందన లభించింది. ఏ థియేటర్ చూసినా ఫాస్ట్ ఫిల్లింగ్ బోర్డులు, సోల్డ్ ఔట్ బోర్డులే కనిపించాయి. ఈ దెబ్బతో బుక్‌మైషోలో ఇప్పటివరకు టాప్ లో ఉన్న సంచలన సినిమాలు అన్నీ వెనక్కి వెళ్లాయి. ఈ జాబితాలో 1 లక్షా 9వేల 170 ట్రెండింగ్‌తో రణ్ వీర్ సింగ్ భారీ యాక్షన్ ఫిల్మ్ ధురంధర్ 2 రెండో స్థానంలో ఉండగా.. దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అల్లు అర్జున్ పుష్ప 2 మూడో స్థానానికి పడిపోయింది. ఇక మలయాళ సెన్సేషన్, మోహన్ లాల్ ఎంపురాన్ నాలుగో స్థానంలో నిలవగా, ప్రభాస్ గ్లోబల్ విజువల్ వండర్ కల్కి ఐదో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో కాంతార: చాప్టర్ 1, జవాన్, జైలర్ 2, లియో , యానిమల్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అన్నీ కూడా రామాయణ సునామీ ముందు టాప్ 10 లో చివరి స్థానాలకు పరిమితం అయ్యాయి. ఇందులో ఎంపురాన్, లియో లాంటి చిత్రాలకు సంబంధించిన గణాంకాలు కేవలం ప్రీ-సేల్స్ సమయంలో నమోదైనవి కావడం గమనార్హం. ఇక ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 500 కోట్ల మార్కుకు చేరువైంది. ఇండియాలో ఈ సినిమా మొదటి 4 రోజుల మొత్తం నెట్ వసూళ్లు 238 కోట్లు కాగా, గ్రాస్ వసూళ్లు రూ. 285 కోట్లుగా నమోదయ్యాయి. ఆదివారం ఒక్కరోజే భారత్‌లో ఏకంగా రూ.56 కోట్ల భారీ నెట్ వసూళ్లను సాధించి సత్తాచాటింది. ఇక ఓవర్సీస్ మార్కెట్ లో ఏకంగా రూ.214 కోట్ల భారీ గ్రాస్ వసూళ్లు రాబట్టింది. టోటల్ గా చూసుకుంటే కేవలం ఫస్ట్ 4 డేస్ వీకెండ్ లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు 500 కోట్లు కొల్లగొట్టి ఇండియన్ బాక్సాఫీస్ రారాజుగా నిలిచింది. కలెక్షన్స్ కు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాలో నటీనటుల పర్ఫార్మెన్స్ గురించి కూడా మంచి ప్రశంసలు వస్తున్నాయి.



