అనుపమపై క్రష్.. ప్రశంసలు కురిపించిన స్టార్ లిరిసిస్ట్?
కామెంట్లు (0)

తన అందం, సహజమైన నటనతో అందరినీ కట్టిపడేసిన బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. సాధారణంగా ఒక హీరోయిన్ అంటే కుర్రాళ్లకు, ప్రేక్షకులకు క్రష్ ఉండటం సహజం. కానీ ఒక స్టార్ లిరిసిస్ట్, అది కూడా స్టేజ్ మీద మైక్ పట్టుకుని, అందరి ముందు నాకు కూడా నీ మీద క్రష్ ఉంది, అని ఓపెన్‌గా చెప్తే ఎలా ఉంటుంది? ఆ మూమెంట్ కచ్చితంగా వైరల్ అవుతుంది కదా. సరిగ్గా ఇప్పుడు అదే జరిగింది. టాలీవుడ్ స్టార్ లిరిసిస్ట్? అనుపమ గురించి చేసిన క్రేజీ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
అనుపమ పరమేశ్వరన్, నటుడు నరేష్ వీకే, టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సరికొత్త చిత్రం క్రేజీ కల్యాణం. బద్రప్ప గాజుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను, బూసం జగన్ మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.మొన్నటి వరకు డీజే టిల్లు లాంటి గ్లామరస్ రోల్స్ చేసిన అనుపమ, మళ్ళీ ఇప్పుడు ఒక మంచి కంటెంట్ బేస్డ్ సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఇదే నెల 16వ తేదీన థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. దీని ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ఒకదాని తర్వాత ఒకటి ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను చాలా గ్రాండ్‌గా నిర్వహించిన మూవీ టీమ్, తాజాగా సినిమా క్రేజ్‌ను మరింత పెంచడానికి క్రేజీ కల్యాణం బారాత్ పేరుతో మరో స్పెషల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులతో పాటు, సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ అంతా హాజరయ్యారు. ఈ వేదిక మీదే స్టార్ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ మైక్ అందుకుని తన మనసులోని మాటలను బయటపెట్టారు.
మామూలుగానే కాసర్ల శ్యామ్ పాటల్లో ఉండే ప్రాస, ఆయన మాటల్లో కూడా ఉంటుంది. ఇక స్టేజ్ మీదకు వచ్చిన శ్యామ్, ఏమాత్రం మొహమాటం లేకుండా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌ను ఉద్దేశించి చాలా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. అందరిలాగే అనుపమ అంటే నాకు కూడా చాలా క్రష్ అని స్టేజ్ మీదే చెప్పేశారు. ఆమెను తెర మీద చూసిన మొదటి చూపులోనే నేను కూడా పడిపోయాను అంటూ తన మనసులో ఉన్న అభిమానాన్ని ఓపెన్‌గా బయటపెట్టారు. అంతేకాకుండా, తాను అనుపమను ముద్దుగా అ ఆ అని పిలుస్తానని ఒక కొత్త సీక్రెట్ చెప్పారు. అక్కడ అ ఆ.. అంటే త్రివిక్రమ్ సినిమా పేరు కాదు. నేను ఆమెను అ ఆ అని పిలుస్తాను.. అందులో అ అంటే అనుపమ..ఆ అంటే ఆరాధన. అందుకే నేను ఆమెను అంత క్రేజీగా ఆరాధిస్తున్నాను అని కాసర్ల శ్యామ్ చెప్పగానే అక్కడున్న వాళ్లంతా గట్టిగా అరిచి గోల చేశారు. ఇక అంతటితో ఆగకుండా.. నేను మీకు వీరాభిమానిని అయిపోయాను అనుపమ గారూ మీరు కేవలం అద్భుతమైన నటి మాత్రమే కాదు, పాటలు కూడా చాలా మంచిగా పాడతారు అంటూ ఆమెలోని టాలెంట్‌ను కూడా కొనియాడారు లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్.
ఒక స్టార్ లిరిసిస్ట్ ఇలా ఓపెన్‌గా తన మీద ప్రశంసల వర్షం కురిపిస్తుంటే, వేదిక మీద ఉన్న అనుపమ ఆనందంతో, సిగ్గుతో మురిసిపోయింది. ఆయన వేసిన పంచులకు, పొగడ్తలకు ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ నవ్వులు చిందించింది. ప్రస్తుతం కాసర్ల శ్యామ్ మాట్లాడిన ఈ వీడియో క్లిప్స్, అలాగే అనుపమ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కాసర్ల శ్యామ్ అన్న మా కుర్రాళ్ల మనసులో మాటను కరెక్ట్‌గా స్టేజ్ మీద చెప్పాడు, అ ఆ.. అంటే అనుపమ ఆరాధన.. వాట్ ఏ ప్రాస అన్నయ్యా అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా క్రేజీ కల్యాణం బారాత్ ఈవెంట్లో కాసర్ల శ్యామ్ స్పీచ్ మాత్రం సినిమా ప్రమోషన్స్‌కు బాగానే హెల్ప్ అయిందని చెప్పాలి.



