ముఖ్య కంటెంట్‌కు వెళ్లడానికి
Mega9 TVMega9 TV📰
బ్రేకింగ్ న్యూస్

పాక్ లో నిలబడి భారత్‌ పై అక్కసు..బంగ్లా స్పీకర్ డబుల్ గేమ్..!

Mega9 TV Adminప్రచురణ: 28 నవంబర్, 2026 06:19 AMకి👁 02 నిమి చదవండి
షేర్ చేయండి:
పాక్ లో నిలబడి భారత్‌ పై అక్కసు..బంగ్లా స్పీకర్ డబుల్ గేమ్..!
FONT SIZE

ఏకంగా దేశ చరిత్రనే వక్రీకరిస్తూ, అది కూడా పాకిస్థాన్ గడ్డపై నిలబడి బంగ్లాదేశ్ పార్లమెంట్ స్పీకర్ హఫీజుద్దీన్ అహ్మద్ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 1971 బంగ్లా విమోచన యుద్ధంలో భారత్ తమకు అసలు సహాయమే చేయలేదని, కేవలం పాకిస్థాన్‌ను బలహీనపరిచేందుకే పనిచేసిందని ఆయన ఆరోపించడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఇక్కడ అసలైన విడ్డూరం ఏంటో తెలుసా? ఇదే నాయకుడు కొద్ది నెలల క్రితం భారత సైన్యాన్ని ఆకాశానికెత్తుతూ పొగిడారు. ఆ పాత ఇంటర్వ్యూ ఇప్పుడు బయటకు రావడంతో హఫీజుద్దీన్ ద్వంద్వ వైఖరిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని పార్లమెంట్ హౌస్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 1971లో భారత్ బెంగాలీలకు సహాయపడలేదు, కేవలం పాకిస్థాన్‌ను బలహీనపరిచింది అని హఫీజుద్దీన్ వ్యాఖ్యానించారు. అలాగే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పాలనపైనా తీవ్ర ఆరోపణలు చేశారు. హసీనా హయాంలో బంగ్లాదేశ్ వాస్తవంగా భారత్‌కు ఒక కాలనీ గా మారిపోయిందని ఆయన ఆరోపించారు. గతంలో బంగ్లాదేశ్‌లో నిజమైన ప్రజాస్వామ్యమే లేదని, 1975లోనే ఏక పార్టీ వ్యవస్థను ప్రవేశపెట్టారని విమర్శించారు. అయితే, 2026 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికలు మాత్రం పూర్తి స్వేచ్ఛగా జరిగాయని ఆయన చెప్పుకోవడం గమనార్హం. ఇక ఈ మొత్తం వ్యవహారంలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న విషయం హఫీజుద్దీన్ అహ్మద్ నేపథ్యం, ఆయన పాత మాటలు. ఇప్పుడు పాకిస్థాన్ గడ్డపై నిలబడి భారత్‌పై విమర్శలు గుప్పిస్తున్న ఇదే హఫీజుద్దీన్ అహ్మద్.. ఒకప్పుడు పాకిస్థాన్ సైన్యంలో కెప్టెన్‌గా పనిచేశారు. 1971 యుద్ధ సమయంలో ఆయన పాక్ సైన్యం నుంచి బయటకు వచ్చి బంగ్లాదేశ్ విమోచన కోసం పోరాడారు. ఆ యుద్ధంలో చూపిన ధైర్యానికి గానూ బంగ్లాదేశ్‌లో గౌరవ పురస్కారం కూడా అందుకున్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు తన సొంత గతాన్ని, తాను స్వయంగా గతంలో చెప్పిన మాటలను పూర్తిగా విస్మరించి మాట్లాడటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

2025 డిసెంబర్‌లో ప్రోథమ్ ఆలో అనే ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హఫీజుద్దీన్ స్వయంగా భారత సైనిక సహాయాన్ని మనస్ఫూర్తిగా ప్రశంసించారు. 1971లో సిల్హెట్ విముక్తి కోసం జరిగిన పోరాటాన్ని గుర్తుచేసుకుంటూ.. ఆ రోజు తమతో పాటు ఒక భారత ఆర్మీ మేజర్ , వైర్‌లెస్ సెట్ ఉన్నాయని ఆయన స్పష్టంగా తెలిపారు. అంతేకాదు, మా అభ్యర్థన మేరకు, రెండు భారత మిగ్ విమానాలు వచ్చి పాకిస్థాన్ బంకర్లపై పదిహేను నిమిషాల పాటు రాకెట్లతో దాడి చేసి, వాటిని నేలమట్టం చేశాయి. ఆ దెబ్బకు పాకిస్థాన్ సైన్యం లొంగిపోవాల్సి వచ్చింది అని హఫీజుద్దీన్ అప్పట్లో ఎంతో స్పష్టంగా వివరించారు 2025 డిసెంబర్‌లో భారత మిగ్ విమానాల దెబ్బకే పాకిస్థాన్ సైన్యం లొంగిపోయిందని, భారత సైనిక సాయంతోనే గెలిచామని గొప్పగా చెప్పుకున్న అదే నాయకుడు.. ఇప్పుడు పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టగానే పూర్తిగా మాట మార్చేశారు. బంగ్లాదేశ్ విమోచన పోరాటంలో భారత్ పోషించిన చారిత్రక పాత్రను కొనియాడిన నోటితోనే, ఇప్పుడు అందుకు పూర్తి విరుద్ధమైన ఆరోపణలు చేయడం ఆయన ద్వంద్వ వైఖరిని, అవకాశవాదాన్ని స్పష్టంగా బయటపెడుతోంది. పాకిస్థాన్ పర్యటనలో ఆయన వైఖరి మార్చుకున్న తీరుపై రాజకీయ విశ్లేషకులు తీవ్ర ఆశ్చర్యం, విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

కామెంట్లు (0)

మీ అభిప్రాయం రాయండి

అసభ్య/స్పామ్ కామెంట్లు తొలగించబడతాయి.

సంబంధిత వార్తలు