శత్రువులకు హడల్…భారత్ తో ఫిలిప్పీన్స్ భారీ బ్రహ్మోస్ డీల్!

ఒకప్పుడు పలు దేశాల నుండి వేల కోట్ల రూపాయలు పెట్టి ఆయుధాలను కొనుక్కునే స్థాయి నుంచి.. ఇప్పుడు అదే వేల కోట్ల రూపాయల ఆయుధాలను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారతదేశం ఎదిగింది. ముఖ్యంగా బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆసియాలో పొరుగు దేశాలను, ముఖ్యంగా చిన్న దేశాలను తన మిలిటరీ పవర్ తో భయపెట్టాలని చూసే డ్రాగన్ కంట్రీ చైనాకు ఇప్పుడు ఇండియా ఒక మైండ్ బ్లాంక్ అయ్యే మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. సౌత్ చైనా సీ వివాదంలో చైనాతో డైరెక్ట్ గా గొడవ పడుతున్న ఫిలిప్పీన్స్ ఇండియాతో ఏకంగా 6,700 కోట్ల భారీ డీల్ కు రెడీ అయింది. ఈ డీల్ కింద సుమారు 60 బ్రహ్మోస్ మిస్సైల్స్ ను ఫిలిప్పీన్స్ కు ఇండియా సప్లై చేయబోతోంది. అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఇండియా , ఫిలిప్పీన్స్ మధ్య ప్రస్తుతం ఒక భారీ డిఫెన్స్ డీల్ దాదాపు ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. 2022లో ఫిలిప్పీన్స్ మన దేశంతో 375 మిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకుని బ్రహ్మోస్ సిస్టమ్స్ ను కొనుగోలు చేసింది. వాటి డెలివరీలు ఇప్పుడు ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి. అయితే చైనాతో ముప్పు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో, ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ మరిన్ని బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించారు.
తాజా ప్రపోజల్ ప్రకారం.. 700 నుంచి 800 మిలియన్ డాలర్ల ఖర్చుతో ఏకంగా 5 బ్రహ్మోస్ సిస్టమ్స్ ను, అంటే సుమారు 60కి పైగా సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ఫిలిప్పీన్స్ ప్రొక్యూర్ చేసుకోబోతోంది. ఢిల్లీలో జరిగిన ఢిల్లీ డిఫెన్స్ డైలాగ్ లో వర్చువల్ గా పాల్గొన్న ఫిలిప్పీన్స్ డిఫెన్స్ సెక్రటరీ గిల్బర్టో టియోడోరో కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. తమ కోస్టల్ డిఫెన్స్ కు తగ్గట్లుగా బ్రహ్మోస్ లో కొన్ని మార్పులు చేయాలని ఇండియాకు ఒక విష్ లిస్ట్ పంపినట్లు ఆయన తెలిపారు. సౌత్ చైనా సముద్రం మొత్తం తనదేనని చైనా వాదిస్తుంటే, ఇంటర్నేషనల్ చట్టాల ప్రకారం తమ తీర ప్రాంతం తమకే చెందుతుందని ఫిలిప్పీన్స్ వాదిస్తోంది. ఈ క్రమంలోనే గత కొన్నేళ్లుగా చైనా కోస్ట్ గార్డ్ నౌకలు కావాలనే ఫిలిప్పీన్స్ పడవలపై వాటర్ క్యానన్స్ తో దాడులు చేయడం, ఢీకొట్టడం లాంటి కవ్వింపు చర్యలకు దిగుతున్నాయి. దీంతో తమ తీరప్రాంత రక్షణను కట్టుదిట్టం చేయడానికి, తమ మిలిటరీని మోడ్రనైజ్ చేయడానికి ఫిలిప్పీన్స్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.



