నష్టాలకు బ్రేక్…రాణించిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Spread the love

దేశీయ  స్టాక్ మార్కెట్లు మూడు రోజుల వరుస నష్టాల తర్వాత భారీ లాభాలోకి దూసుకెళ్లాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైనప్పటికీ, చివరి గంటలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు లాభాల బాట పట్టాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ దాదాపు 939 పాయింట్లు లాభంతో 75,503 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 257 పాయింట్ల లాభంతో 23,408 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ. 92.24గా కొనసాగుతోంది. అల్ట్రాటెక్ సిమెంట్, మహీంద్రా అండ్ మహీంద్రా తదితర షేర్లు లాభాలతో ముగిశాయి. గత వారం భారీ నష్టాల్లో ట్రేడ్ అయిన నేపథ్యంలో తక్కువ ధరకే నాణ్యమైన షేర్లు లభిస్తుండటంతో మదుపర్లు అటువైపు ఆసక్తి కనబరిచారు. మిడిల్ ఈస్ట్ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులున్నప్పటికీ  భారత్-ఇరాన్ మధ్య దౌత్యపరమైన చర్చలు కొంత అనుకూలించాయి. ఇక మార్కెట్ జోష్ లో ముఖ్యంగా ఆటో, బ్యాంకింగ్, మరియు FMCG రంగాలు రాణించాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *