ఐసీసీ ఫైనల్ లో న్యూజిలాండ్..సెమీస్ లో సౌతాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం

Spread the love

ఐసీసీ టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ లోకి న్యూజిలాండ్ దూసుకెళ్లింది. తాజాగా జరిగిన సెమీ ఫైనల్ లో సౌతాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఆ జట్టు ఫైనల్ చేరింది. ఈ రోజు జరిగే మరో సెమీ ఫైనల్ ఇంగ్లాండ్-భారత్ మ్యాచ్ లో విజేతతో ఫైనల్ లో ట్రోఫీ కోసం తలపడనుంది. ఇక సౌతాఫ్రికా-న్యూజిలాండ్ మ్యాచ్ విషయానికి వస్తే మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. మార్కో యెన్సన్ 55 నాటౌట్ (30; 2×4, 5×6) టాప్ స్కోరర్. బ్రెవిస్ (34), ట్రిస్టన్ స్టబ్స్ (29) మినహా ఎవరూ పెద్దగా పరుగులు చేయలేదు. దీంతో ఒక మాదిరి లక్ష్యాన్ని మాత్రమే ప్రత్యర్థి ముందు నిర్దేశించగలిగింది. న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ, రచిన్ రవీంద్ర, కోలే మేకాంచె 2 వికెట్లు చొప్పున తీశారు. ఫెర్గుసన్, జేమ్స్ నీషమ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక టార్గెట్ ఛేజింగ్ లో న్యూజిలాండ్ ఎక్కడా తడబడలేదు. ముఖ్యంగా ఫిన్ అలెన్ 100 నాటౌట్ (33; 10×4, 8×6) విధ్వంసకర బ్యాటింగ్ తో సౌతాఫ్రికా బౌలర్లను ధాటిగా ఆడుతూ పరుగులు రాబట్టాడు. సెంచరీతో సత్తాచాటి కివీస్ ను విజయ తీరాలకు చేర్చాడు. టిమ్ సెఫర్ట్ 58 (33; 7×4, 2×6) హాఫ్ సెంచరీతో రాణించాడు. దీంతో కేవలం 12.5ఓవర్లలోనే 1 వికెట్ మాత్రమే కోల్పోయి 173 పరుగులు చేసింది. ఇక సౌతాఫ్రికా బౌలర్లలో రబడా కు ఒక వికెట్ దక్కింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *